‘బ్రహ్మాస్త’.. కలర్ ఫుల్ గా ‘కుంకుమలా’ సాంగ్ టీజర్..!

Kunkumala Song Teaser From Brahmastra Out Now,Kumkumala,Telugu Version Of Kesariya Song From Brahmastra Released,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Brahmastra,Brahmastra Movie,Brahmastra Telugu Movie,Brahmastra Movie Updates,Brahmastra Upcoming Movie Updates,Brahmastra latst Movie Songs,Brahmastra Songs,Brahmastra Telugu Version Songs Released, Brahmastra Kumkumala Song In Telugu Version Released,Brahmastra Kumkumala Song Released,Brahmastra Kumkumala Song,Telugu Version Of Kesariya Song Kumkumala Released, Ranbir Kapoor and Alia Bhatt Movie Brahmastra,Brahmastra Director Ayan Mukerji,Brahmastra Movie Releasing on 9th September 2022

బాలీవుడ్ లో అందరూ ఆసక్తిగా ఎదుచూస్తున్న సినిమా బ్రహ్మాస్త్ర. ఈసినిమాను అత్యంత భారీ బడ్జెట్ తో అలానే భారీ విఎఫ్ఎక్స్ తో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈసినిమా నుండి రిలీజ్ చేసిన రణబీర్ కపూర్ అలానే అలియా ఇంట్రడక్షన్ గ్లింప్స్ ను చూస్తేనే ఈసినిమాలో గ్రాఫిక్స్ ఏ రేంజ్ లో ఉండబోతున్నాయో అర్ధమవుతుంది. ప్రస్తుతం అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులను కంప్లీట్ చేసుకునే పనిలో ఉంది ఈసినిమా. మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలు కూడా భారీగానే ప్లాన్ చేసినట్టు గతంలోనే తెలిపారు. దానికి తగ్గట్టే ఇప్పుడు ఒక్కొక్క అప్ డేట్ ఇవ్వడం మొదలుపెడుతున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక మ్యూజికల్ ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టారు. దీనిలో భాగంగానే ఈసినిమాలోని కేసరియా అంటూ వచ్చే హిందీ పాటను ఇప్పటికే రిలీజ్ చేశారు మేకర్స్. ఈపాటను తెలుగులో కూడా రిలీజ్ చేశారు. కుంకుమలా అంటూ వచ్చే ఈపాట టీజర్ ను దర్శకధీరుడు రాజమౌళి చేతుల మీదుగా రిలీజ్ చేశారు. ‘ఆ బ్రహ్మే నిన్ను చేయడానికే తన ఆస్తి మొత్తాన్నే ఖర్చే పెట్టుంటాడే’ అంటూ సాగిన ఈ గీతాన్ని సిద్ శ్రీరామ్ ఆలపించారు. ప్రీతమ్ సంగీతం అందించిన ఆపాటకు చంద్రబోస్ లిరిక్స్ అందించారు. ఇక ఈపాట టీజర్ చాలా కలర్ ఫుల్ గా ఉండి ఆకట్టుకుంటుంది. మరి ఫుల్ సాంగ్ ఇంకెంత కలర్ ఫుల్ గా ఉంటుందో చూడాలి.

కాగా సోషియో ఫాంటసీగా వస్తున్న ఈసినిమాను మూడు భాగాలుగా రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ”బ్రహ్మాస్త్ర ఫస్ట్ పార్ట్: శివ” పేరుతో మొదటి భాగాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో వస్తున్న ఈసినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్‌ బచ్చన్‌, అలానే నాగర్జున మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. ధర్మ ప్రొడక్షన్స్, ఫాక్స్ స్టార్ స్టూడియోస్ సంయుక్తంగా ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఫస్ట్ పార్ట్ ఈ ఏడాది సెప్టెంబరు 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 − 4 =