100 కోట్ల క్లబ్ లో కార్తికేయన్ ‘డాన్’

Siva Karthikeyan Don Enters 100 Crores Club,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Don,Don Movie,Don Movie Updates,Don Movie Latest News,Don Collections,Don Movie Collections,Don Box Office Collections,Don Areawise Collections,Don Worldwide Collections,Siva Karthikeyan,Don Enters 100 Crores Club

విభిన్నమైన సినిమాలు చేసుకుంటూ వరుసగా విజయాలను అందుకుంటూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు తమిళ టాలెంటెడ్ నటుడు శివ కార్తికేయన్. ఆర్టిస్ట్ గా కెరీర్ ను ప్రారంభించిన శివ కార్తికేయన్ తక్కువ టైంలోనే స్టార్ హీరో రేంజ్ కు ఎదిగాడు. గత ఏడాదే డాక్టర్ సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. ఈసినిమా కూడా ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి సూపర్ హిట్ అవ్వడమే కాదు.. సాలిడ్ కలెక్షన్స్ ను అందించింది. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన డాన్ సినిమా కూడా అస్సలు తగ్గడం లేదు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సిబి చక్రవర్తి దర్శకత్వంలో శివకార్తికేయన్ హీరోగా వచ్చిన సినిమా డాన్. తమిళ్ తో పాటు తెలుగులో కూడా ఈసినిమాను ఒకేసారి రిలీజ్ చేశారు. తెలుగులో కాలేజీ డాన్ పేరుతో ఈసినిమాను రిలీజ్ చేశారు. మే 13వ తేదీన ఈసినిమా రిలీజ్ అవ్వగా.. ఈసినిమా కూడా మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. కాలేజీ నేపథ్యంలో సాగే కామెడీ ఎంటర్ టైనర్ గా ‘డాన్’ మూవీని రూపొందించారు. దీంతో ఈసినిమా యూత్ కు బాగా కనెక్ట్ అవుతుంది. అంతేకాదు ఈసినిమా మంచి కలెక్షన్స్ ను కూడా అందిస్తుంది. ఈనేపథ్యంలోనే రిలీజ్ అయిన 12 రోజుల్లో ఈసినిమా వంద కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. తెలుగులో కూడా మంచి ఆదరణ లభిస్తుంది ఈసినిమాకు. మరి చిన్న సినిమాగా వచ్చిన ఈసినిమా ఈరేంజ్ లో టాక్ ను సొంతం చేసుకొని కలెక్షన్స్ ను రాబట్టుకోవడం గ్రేటే.

కాగా ఈ మూవీలో ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటించింది. ఎస్. జె. సూర్య సముద్రఖని కీలక పాత్రల్లో నటించారు. లైకా ప్రొడ‌క్ష‌న్స్, శివ‌ కార్తికేయ‌న్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ల‌పై సంయుక్తంగా తెర‌కెక్కిన ఈ చిత్రానికి అనిరుధ్ ర‌విచంద‌ర్ సంగీతం అందించాడు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 + 12 =