175 రోజులు పూర్తి చేసుకున్న ‘అఖండ’

Akhanda Movie Completed 175 Days,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Akhanda,Akhanda Movie,Akhanda Telugu Movie,Akhanda Movie Updates,Akhanda Telugu Movie Latest News,175 Days For Akhanda Movie,Balakrishna Akhanda Movie Completed 175 Days,Balakrishna,Nandamuri Balakrishna

ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్స్ కు స్పెషల్ క్రేజ్ ఉంటుంది. అలాంటి కాంబినేషన్స్ లో ఒకటే నటసింహం బాలకృష్ణ-బోయపాటి శ్రీనుది. వీరిద్దరి కాంబినేష్ అంటే బాలయ్య ఫ్యాన్స్ కు మాత్రమే కాదు సినీ ప్రేక్షకులందరికీ ఆసక్తికరంగానే ఉంటుంది. ఇక వీరిద్దరి కాంబినేష్ లో వచ్చిన మూడు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లే అందుకున్నాయి. ఇంతకుముందు బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన ‘సింహా’, ‘లెజెండ్’ సినిమాలు బ్లాక్ బస్టర్ అందుకున్నాయి. ఇక రీసెంట్ గా ఎన్నో అంచనాల మధ్య వచ్చిన అఖండ సినిమా కూడా అదే రేంజ్ లో హిట్ అయింది. ఇక ఈ మూడు సినిమాలు బాలకృష్ణ కెరీర్ హయ్యస్ట్ రెవెన్యూ కలెక్ట్ చేసిన చిత్రాలుగా నిలిచాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాగా ఈసినిమా మరో రికార్డును సొంతం చేసుకుంది. అఖండ సినిమా గత డిసెంబర్ 2వ తేదీన విడుదలైంది. ఇక తాజాగా 175 రోజులను పూర్తిచేసుకుంది. ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ అందుకు సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేశారు. సింహా, లెజెండ్ సినిమాలు సిల్వర్ జూబిలీ మార్క్ ను టచ్ చేయగా.. ఇప్పుడు ఈసినిమా కూడా ఆ మార్క్ ను దాటడంతో.. తిరుగులేని బ్లాక్ బస్టర్స్ ట్రిపుల్ సిల్వర్ జూబ్లీ కాంబినేషన్ గా చరిత్ర సృష్టించారు. మరి వీరిద్దరి కాంబినేషన్ లో నాలుగో సినిమా ఎప్పుడొస్తుందో చూడాలి.

ఇక ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్‌ హీరోయిన్ గా నటించగా పూర్ణ, శ్రీకాంత్, జగపతిబాబు కీలక పాత్రల్లో నటించారు. మిర్యాల స‌త్యనారాయ‌ణ రెడ్డి స‌మ‌ర్పణ‌లో ద్వారకా క్రియేషన్స్ ప‌తాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఎస్.ఎస్ థమన్ సంగీతం అందించిన ఈ సినిమాకు సి.రాంప్రసాద్ సినిమాటోగ్రఫీ అందించారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × two =