నాగ చైతన్య ‘థాంక్యూ’ టీజర్ రిలీజ్

Thank You Teaser Out Now,Naga Chaitanya’s Thank You Movie Teaser Out Now,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Thank You,Thank You Movie,Thank You Telugu Movie,Thank You Teaser,Thank You Movie Teaser,Thank You Telugu Movie Teaser,Naga Chaitanya,Naga Chaitanya Thank You Teaser,Akkineni Naga Chaitanya Thank You Teaser,Naga Chaitanya Thank You Movie Teaser,Naga Chaitanya Thank You Telugu Movie Teaser,Raashi Khanna,Thaman S,Vikram K Kumar

టాలీవుడ్ యంగ్ హీరో నాగ చైత‌న్య ప్రస్తుతం వరుస హిట్లతో ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. గత ఏడాది లవ్ స్టోరీ సినిమాతో ఈఏడాది బంగార్రాజు సినిమాలతో వరుస హిట్స్ కొట్టిన నాగచైతన్య ఇప్పుడు థాంక్యూ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. మనం లాంటి సూపర్ హిట్ సినిమా తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఇది. దీంతో మొదటినుండే ఈసినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది ఈసినిమా.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈసినిమాను జూన్ 8న విడుదల చేయనున్నారు. దానికి తగ్గట్లుగా ప్రమోషన్స్ మొదలుపెట్టారు మేకర్స్. ఇక ఇప్పటికే ఈసినిమా నుండి పలు పోస్టర్లు రిలీజ్ చేయగా.. తాజాగా ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేశారు. నా సక్సెస్‌కు నేను కారణం’ అని నాగచైతన్య వాయిస్‌తో మొదలయిన టీజర్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. అహంకారంతో ఉన్న ఓ యువకుడు తన లైఫ్ లో ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు.. లైఫ్ లో ఏం కోల్పోయాడు.. ఫైనల్ గా తన తప్పును ఎలా తెలుసుకున్నాడు అన్నది ఈసినిమా ద్వారా చూపించనున్నట్టు అర్ధమవుతుంది. మరోవైపు ఈసినిమాలో కూడా మూడు లవ్ స్టోరీ లు ఉన్నట్టు అర్ధమవుతుంది. ఇంకా ‘లైఫ్‌లో ఇంకా కాంప్రమైజ్ అవ్వను.. ఎన్నో వదులుకొని ఇక్కడ వరకు వచ్చాను’ అన్న డైలాగ్ ఆకట్టుకుంటుంది. మొత్తానికి టీజర్ అయితే సినిమాపై అంచనాలను పెంచేసింది. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

ఈసినిమాలో రాశీఖన్నా హీరోయిన్ గా నటిస్తుండగా..  అవికా గోర్,మాళవిక నాయర్, ప్రకాష్ రాజ్ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. . టాలీవుడ్ ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు ఈ మూవీని నిర్మిస్తుండ‌గా థమన్ సంగీతం అందిస్తున్నాడు. పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 + eight =