క్షణం, గూఢచారి, ఎవరు వంటి సినిమాలతో టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు అడివి శేష్. తను చేసే సినిమాలు, ఎంచుకునే కథలు డిఫరెంట్ గా ఉంటాయని మరోసారి మేజర్ తో నిరూపించడానికి వచ్చేస్తున్నాడు. 26/11 ఘటన అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు అదే ఘటనను వెండితెరపై ఆవిష్కరించడానికి వచ్చేస్తున్నాడు. 26/11 ముంబై దాడుల్లో తన ప్రాణాలను పణంగా పెట్టి ఎందరో ప్రాణాలను కాపాడిన ఎన్.ఎస్.జి కమెండో మేజర్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈసినిమా తెరకెక్కుతుంది. ఈసినిమా కోసం చాలా సంవత్సరాలే వెయిట్ చేశాడు అడివి శేష్. ఫైనల్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమాను జూన్ 3న విడుదల చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మేకర్స్ జోరుగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా అందరూ దిగ్భ్రాంతికి గురైన సంఘటన కాబట్టి.. దేశవ్యాప్తంగా ఉన్న జనాల్లోకి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తున్నారు. దీనిలో భాగాంగానే ప్రీ రిలీజ్ ను కూడా భారీగా నిర్వహించనున్నారు. ఈసినిమాను దేశవ్యాప్తంగా ఉన్న 9 నగరాల్లో ప్రీ రిలీజ్ స్క్రీనింగ్ నిర్వహించనున్నారు. హైద్రాబాద్, ఢిల్లీ, లక్నో, జైపూర్, బెంగుళూరు, ముంబై, అహమ్మదాబాద్, పూణె, కొచ్చి ప్రాంతాల్లో ప్రీ రిలీజ్ షోలు వేయనున్నారు. ఈ షోలను చూడటానికి బుక్ మై షోలో టికెట్లు బుక్ చేసుకోవచ్చు. మరి సినిమా రిలీజ్ కు దాదాపు పది రోజుల ముందే ప్రీ రిలీజ్ షోలు వేయడం అంటే మాములు విషయం కాదు. చూద్దాం మరి ఈప్రయోగం ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో.
Namaste India. We are coming to you with our film, 10 days in advance.#Major Pre release Film Screenings across India from May 24th 💥💥
Stay tuned to @bookmyshow to book tickets in your cities for the exclusive screening of #MajorTheFilm.#MajorOnJune3rd pic.twitter.com/at79sONMlS
— GMB Entertainment (@GMBents) May 23, 2022



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
తెలుగు ఫుల్ మూవీస్
Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.