“F 3” మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్

F3 Pre Release Event Highlights,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, F3 Movie Pre Release Event,Pre-Release Event of F3 Movie,F3 Movie Pre Release Event Highlights,Pre Release Highlights of F3 Movie, Venkatesh and Varun Tej F3 Movie Pre Release Event,F3 Movie Review,F3 Telugu Movie Review,F3 Review,F3 Movie Review And Rating,F3 Review And Rating,F3 Preview, F3 Movie Pre Review,F3 Movie Censor Review,F3 (film),F3: Fun and Frustration,F3 Movie (2022),F3: Fun and Frustration Movie (May 2022),F3 Movie Plus Points, F3 FDFS Review,F3 Movie First Review,F3 First Review Out,F3 Movie Critics Review,F3 Movie Public Talk,F3 Movie Public Response,F3 Movie Highlights,F3 Movie Story, F3,F3 Movie,F3 Telugu Movie,F3 (2022),F3 Movie Review (2022),F3 Movie Updates,F3 Movie Latest News and Updates,F3 Movie Latest News,F3 Telugu Movie Latest News, F3 Telugu Movie Live Updates,F3 Highlights,F3 Public Response,F3 Fun and Frustration,Venkatesh F3 Movie Review,Varun Tej F3 Movie Review,Venkatesh And Varun Tej F3 Movie Review, Venkatesh,Varun Tej,Anil Ravipudi,DSP,Dil Raju,Tamannaah,Mehreen Pirzada,Sunil,Sonal Cauhan,Ali

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, వరుణ్ తేజ్ , తమన్నా , మెహరీన్ ప్రధాన పాత్రలలో బ్లాక్ బస్టర్ “F 2:ఫన్ &ఫ్రస్టేషన్ ” మూవీ సీక్వెల్ గా తెరకెక్కిన “F 3” మూవీ మే 27 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో సోనాల్ చౌహాన్, సునీల్ కీలక పాత్రలలో నటించారు. స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , సాంగ్స్ , దసరా స్పెషల్ వీడియో, సాంగ్ మేకింగ్ వీడియో, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“F3 ” మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ 21న హైదరాబాదులో శిల్పకళావేదిక లో గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుక లో విక్టరీ వెంకటేష్ మాట్లాడుతూ … మూడు సంవత్సరాల తరువాత తాను నటించిన “F 3” మూవీ థియేటర్స్ లో రిలీజవుతుందనీ , ప్రేక్షకులంతా తప్పకుండా ఎంజాయ్‌ చేస్తారనీ , దర్శకుడు అనిల్ రావిపూడి మంచి స్క్రిప్ట్ తో ఈ మూవీ ని తెరకెక్కించారనీ, వరుణ్ తేజ్ అద్భుతంగా నటించాడనీ , “F 3” మూవీ అదిరిపోతుందనీ చెప్పారు. వరుణ్‌తేజ్‌ మాట్లాడుతూ ఈ సినిమాలో సునీల్‌ గారితో తన కాంబినేషన్‌ బాగా వచ్చిందనీ , “F3 ” మూవీతో దిల్‌రాజు గారి ప్రొడక్షన్‌లో హ్యాట్రిక్‌ కొడతాననీ , వెంకటేష్‌ గారితో రెండోసారి చేసే అదృష్టం తన కు దక్కిందన్నారు. దర్శకుడు అనిల్‌ రావిపూడి మాట్లాడుతూ … కరోనా తర్వాత ప్రేక్షకులను బాగా నవ్వించాలని చాలా కష్టపడ్డామనీ , వెంకటేష్‌, వరుణ్‌తేజ్‌ కామెడీ టైమింగ్‌ అలరిస్తుందనీ చెప్పారు. చిత్ర సమర్పకుడు దిల్‌రాజు మాట్లాడుతూ.. F 2’ కంటే గొప్పగా “F 3” ని ప్రేక్షకులు ఎంజాయ్‌ చేస్తారనీ , దేవి శ్రీ ప్రసాద్‌ అద్భుతమైన సంగీతం అందించారనీ చెప్పారు. ఈ సినిమా ప్రేక్షకులకు మంచి వినోదం పంచుతుందని మెహరీన్‌, “F3 ” మూవీలో పాత్రలన్నీ నవ్వులు పంచుతాయనీ రాజేంద్ర ప్రసాద్ చెప్పారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 − four =