మే 28న స్వర్గీయ నందమూరి తారకరామారావు జయంతి అన్న సంగతి తెలిసిందే కదా. ఇక ఆరోజు కోసం నందమూరి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మరోవైపు ఎన్టీఆర్ శత జయంతి కావడంతో ఆ సందర్బంగా ఘనంగా వేడుకలు నిర్వహించనున్నారు. తనయుడు నందమూరి బాలకృష్ణ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరగనున్నాయి. ఈసందర్భంగా బాలకృష్ణ సోషల్ మీడియా ద్వారా ఓ లేఖను పోస్ట్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ లేఖలో.. అభిమానులకు, తెలుగు నేలకు, విశ్వవ్యాప్తంగా వెలుగులీనుతున్న తెలుగుజాతికి…. నందమూరి బాలకృష్ణ నమస్సుమాంజలి.. మా నాన్నగారు సినీరంగంలో అడుగుపెట్టారు. భారతీయ సినిమా తెలుగు సినిమాని తలఎత్తి చూసింది. తెలుగుదేశం పార్టీని స్థాపించారు. తెలుగు సంస్కృతి తలఎత్తి నిలబడింది. ఆ నందమూరి తారక రామునికి ఈ నెల 28వ తేదీతో నూరవ ఏడు మొదలవుతుంది. ఆ రోజు నుంచి 2023 మే 28 వరకు… 365 రోజుల పాటు శత పురుషుని శత జయంతి వేడుకలు నేల నలుచెరగులా జరగనున్నాయని తెలియజేయడానికి గర్వపడుతున్నాను. మునుపెన్నడూ కనీవినీ ఎరుగని విధంగా ఎన్నో దేశాలలో జరుగుతున్న ఈ వేడుకలకు మా నందమూరి కుటుంబం హాజరవుతుంది. ఆనందంతో పాలుపంచుకుంటుంది.
మా కుటుంబం నుంచి నెలకొక్కరు నెలకో కార్యక్రమంలో భాగస్వాములవుతారు. అందులో భాగంగా నేను 28వ తేదీ ఉదయం మా స్వస్థలం నిమ్మకూరు వెళ్లి, అక్కడి వేడుకలలో పాల్గొంటాను. వందేళ్ల క్రితం మా నాన్నగారిని జాతికందించింది నిమ్మకూరు కనుక అది నా బాధ్యత. అక్కడి నుంచి కళలకాణాచిగా ఖ్యాతిగాంచిన తెనాలి చేరుకుంటాను. అక్కడ జరిగే శతాబ్ది వేడుకలను నా చేతుల మీదుగా ప్రారంభిస్తున్నాను. 365 రోజులు… వారానికి 5 సినిమాలు, వారానికి 2 సదస్సులు, నెలకు రెండు పురస్కార ప్రదానోత్సవాలు… ఈ మహత్కార్యాన్ని పెమ్మసాని (రామకృష్ణ) థియేటర్ లో ప్రారంభించి, ఒంగోలు వెళ్లి మహానాడులో పాల్గొంటానని తెలుగు జాతికి తెలియజేస్తున్నాను. అహర్నిశలు మీ అభిమానం కోసం… మీ నందమూరి బాలకృష్ణ” అంటూ లేఖలో పేర్కొన్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
తెలుగు ఫుల్ మూవీస్
Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.