పలు సూపర్ హిట్ సినిమాలకు రైటర్ గా పని చేసిన కొరటాల శివ సూపర్ హిట్ “మిర్చి “మూవీ తో టాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయం అయ్యారు. “శ్రీమంతుడు “, “జనతా గ్యారేజ్ “”భరత్ అనే నేను ” వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ తో కొరటాల ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. కొరటాల దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కనున్న “#NTR30” మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్ళనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా “#NTR30” , “#NTR31 ” మూవీస్ పోస్టర్స్ రిలీజ్ కావడం తో అభిమానుల ఆనందానికి హద్దే లేదు. తమ అభిమాన హీరో ఎన్టీఆర్ తో బ్లాక్ బస్టర్ “జనతా గ్యారేజ్”మూవీ తెరకెక్కించినా రీసెంట్ గా కొరటాల దర్శకత్వంలో తెరకెక్కిన “ఆచార్య ” మూవీ పరాజయం పాలవడం తో “#NTR30” మూవీ ని కొరటాల ఎలా తెరకెక్కిస్తారనే డౌట్ తో అభిమానులు కొంచెం అసంతృప్తి తో ఉన్నారు. “#NTR30” మూవీ మోషన్ పోస్టర్ కు తెలుగు ప్రేక్షకులతో పాటు హిందీ ప్రేక్షకులనుండి అద్భుత రెస్పాన్స్ వచ్చింది. ఎన్టీఆర్ మోషన్ పోస్టర్ , సాలిడ్ డైలాగ్ తో కొరటాల డిజైన్ చేసి అభిమానులను సర్ ప్రైజ్ చేసి శాటిస్ ఫై చేశారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: