సినీ పరిశ్రమల్లో హీరోయిన్లకు లైఫ్ టైమ్ తక్కువగా ఉంటుందని చెప్పొచ్చు. ఒకప్పుడు అంటే రెండు మూడు దశబ్దాలు సినిమాలు చేసుకుంటూ ఉండేవాళ్లు… కానీ ఇప్పుడు అలా కాదా గట్టిగా పదేళ్లు కూడా హీరోయిన్లు సినిమాలు చేయడానికి అవకాశం లేకుండా పోయింది. అందుకే ఉన్నంత కాలంలోనే పలు ఇండస్ట్రీల్లో సినిమాలు చేయాలని కోరుకుంటారు. అయితే కొంతమంది హీరోయిన్లకు అది కలిసొస్తుంది.. కొంతమందికి కలిసిరాదు. ఇక టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా స్టార్ హీరోలందరితో సినిమాలు చేసిన తమన్నా కూడా తనకు బాలీవుడ్ లో ఎందుకు అవకాశాలు రాలేదో చెప్పుకొస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎంతోమంది స్టార్ హీరోల పక్కన సినిమాలుచేసింది తమన్నా. ఇక స్టార్ హీరోగా ఉన్న సమయంలోనే బాలీవుడ్ వైపు అడుగులు వేసింది. అక్కడ స్టార్ హీరో అక్షయ్ కుమార్ హీరోగా వచ్చిన హిమ్మత్‌వాలా అనే సినిమాలో హీరోయిన్‌గా నటించింది. కానీ అక్కడ ఆ సినిమా దారుణంగా పరాజయం పాలైంది. ఆ తరువాత మరే సినిమాలో కూడా అవకాశాలు రాలేదని.. ఆ సినిమాలో చేయకుండా ఉంటే బావుండేదని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తమన్నా తెలిపింది. ప్రస్తుతం చాలా జాగ్రత్తగా సినిమాలు ఎంపిక చేసుకుంటున్నానని చెప్పింది. అంతేకాదు సౌత్ సినిమాలు బాలీవుడ్‌లో బాగా ఆడుతున్నాయని కూడా తెలిపింది
కాగా ప్రస్తుతం తమన్నా తెలుగులో నటించిన ఎఫ్ 3 మూవీ మే 27న విడుదుల కాబోతోన్న సంగతి తెలిసిందే. వీటితో పాటు గుర్తుందా శీతాకాలం, మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న భోళా శంకర్‌లో కూడా కీలక పాత్రలో నటిస్తుంది. అంతేకాదు హిందీలో ‘బోలే చుడియాన్’, ‘బబ్లీ బౌన్సర్’, ‘ప్లాన్ ఏ ప్లాన్ బీ’ చిత్రాల్లో నటిస్తుండగా అవి రిలీజ్ కు సిద్దమవుతున్నాయి. మరి చూద్దాం ఈసినిమాలతో అయినా బాలీవుడ్ లో తమన్నా సక్సెస్ ను అందుకుంటుందేమో..
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: