వరుస బ్లాక్ బస్టర్ మూవీస్ లో తనదైన స్టైల్ ఆఫ్ యాక్షన్ తో ప్రేక్షక , అభిమానులను అలరిస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ “ఆర్ ఆర్ ఆర్ “మూవీ లో కొమురం భీమ్ గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. బ్లాక్ బస్టర్ “ఆర్ ఆర్ ఆర్ “మూవీ తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ ,కొరటాల శివ దర్శకత్వంలో “#NTR30” మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. యువసుధ ఆర్ట్స్ , ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై కొరటాల శివ దర్శకత్వంలో త్వరలో సెట్స్ పైకి వెళ్ళనున్న “#NTR30” మూవీకై ఎన్టీఆర్ ప్రిపేర్ అవుతున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ రోజు (మే 20) ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర యూనిట్ “ఎన్టీఆర్ 30 మూవీ” మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానున్న “ఎన్టీఆర్ 30” మూవీ మోషన్ పోస్టర్ సౌత్ లో మాత్రమే కాకుండా, హిందీ ప్రేక్షకులను సైతం విశేషం గా ఆకట్టుకుంటుంది.ఎన్టీఆర్ 30 మోషన్ పోస్టర్ కోసం ఎన్టీఆర్ హిందీలో డబ్బింగ్ చెప్పడం విశేషం. కొరటాల శివ, ఎన్టీఆర్ కాంబినేషన్ లో ఇప్పటికే “జనతా గ్యారేజ్” లాంటి బ్లాక్ బస్టర్ చిత్రం ఉండగా, ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ లో ఈ చిత్రం తెరకెక్కనుంది. తాజాగా విడుదల అయిన మోషన్ పోస్టర్ తో సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.ఈ మూవీ కి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























