సూపర్ స్టార్ మహేష్ బాబు , కీర్తి సురేష్ జంటగా మైత్రీ మూవీ మేకర్స్ , 14 రీల్స్ ప్లస్ , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ కామెడీ “సర్కారు వారి పాట” మూవీ మే 12 వ తేదీ గ్రాండ్ గా రిలీజ్ అయ్యి హిట్ టాక్ స్వంతం చేసుకొని తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. మహేష్ బాబు తన స్టైలిష్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. ఈ మూవీ లో సాంగ్స్ , ఫైట్స్ ప్రేక్షక , అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాయి.మహేష్ బాబు , కీర్తి ల స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ మూవీ సూపర్ హిట్ అయిన సందర్భంగా ఎస్ టి బి సి గ్రౌండ్స్ , ప్రకాష్ నగర్ , కర్నూలు లో మ మ మాస్ సెలబ్రేషన్స్ గ్రాండ్ గా జరిగాయి. సూపర్‌స్టార్ మహేష్‌బాబు మాట్లాడుతూ.. “సర్కారు వారి పాట” మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ లా లేదనీ , 100 డేస్ సెలబ్రేషన్స్ లా ఉందనీ , “ఒక్కడు” చిత్రీకరణ సమయంలో కర్నూలుకు వచ్చాననీ , ఈ ఫంక్షన్ కు తిరిగి ఇక్కడకు వచ్చాననీ , ఏదైనా ఫంక్షన్ ఉంటే రాయలసీమలో జరగాలేమోననీ , మీ ప్రేమ , అభిమానానికి హృదయపూర్వక ధన్యవాదాలనీ , సినిమా చూసిన వెంటనే గౌతమ్ తన కు షేక్ హ్యాండ్ ఇచ్చి కౌగిలించుకున్నారనీ , ఈ సినిమాలో బాగా చేసావు నాన్నా అని సితార మెచ్చుకుందనీ , “పోకిరి”, “దూకుడు”సినిమాల కంటే ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది నాన్న (సూపర్ స్టార్ కృష్ణ ) చెప్పారనీ , ఈ క్రెడిట్ అంతా దర్శకుడు పరశురామ్‌కే చెందుతుందనీ , కోవిడ్, లాక్‌డౌన్ కారణంగా రెండేళ్లు మేము చాలా కష్టాలు పడ్డామనీ , ఇప్పుడు అనూహ్య స్పందన రావడంతో అదంతా కనుమరుగైందనీ , ఈ చిత్రానికి పనిచేసిన సాంకేతిక నిపుణులు, నిర్మాతలకు ధన్యవాదాలనీ , కీర్తి సురేష్, సముద్రఖని సినిమాకు కొత్తదనం తీసుకొచ్చారనీ , థమన్ అందించిన కళావతి పాట అదిరిపోయిందనీ చెప్పారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: