‘కె.జి.యఫ్ 2’ చూశా.. థ్యాంక్స్ ప్రశాంత్ నీల్..!

Director Shankar about KGF Chapter 2,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, KGF Chapter 2,KGF Chapter 2 Movie,KGF Chapter 2 Movie Updates,KGF Chapter 2 Latest News,Yash KGF Chapter 2 Movie,Yash Blockbuster Movie KGF Chapter 2, Director Shankar about KGF Chapter 2 Movie,Director Shankar about Prashant Neel KGF Chapter 2 Movie,Director Shankar Praises KGF Chapter 2 Movie and Director

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ హీరోగా వచ్చిన సినిమా కె.జి.యఫ్ చాప్టర్2. ఈసినిమా కె.జి.యఫ్ చాప్టర్ 1కు సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే కదా. ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈసినిమా ఆ అంచనాలను అందుకొని మరో బ్లాక్ బస్టర్ హిట్ ను అందించింది. ఇక కలెక్షన్స్ విషయంలో కూడా ఈసీక్వెల్ ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. మొదటిరోజు నుండి రికార్డు పర్వం మొదలు పెట్టిన ఈసినిమా మొదటి భాగానికి మించిన వసూళ్లను సాధించింది. రిలీజ్ అయిన కొద్ది రోజులకే వేయి కోట్లు కలెక్ట్ చేయడం అనేది మాములు విషయం కాదు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా చూసిన సెలబ్రిటీలు కూడా ఇప్పటికే ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు ఈ లిస్ట్ లో లెజెండరీ డైరెక్టర్ శంకర్ కూడా చేరిపోయారు. ఈసినిమాను చూసిన తరువాత ఆయన తన ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేశారు. ఫైనల్ గా కె.జి.యఫ్ 2 సినిమా చూశాను.. కథ చెప్పిన విధానం, స్క్రీన్‌ప్లే అండ్ ఎడిటింగ్ లో కొత్తదనం చూపించారు. యాక్షన్ ఇంకా డైలాగ్స్ లో బోల్డ్ మూవ్ చాలా బాగా వర్క్ చేశారు. పవర్‌హౌస్‌ యష్ మాస్ లోనే కొత్త యాంగిల్ ను చూపించాడు.. ఇలాంటి ఎక్స్పీరియన్స్ ను ఇచ్చినందుకు థ్యాంక్స్ ప్రశాంత్ నీల్ అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు.

ప్రస్తుతం శంకర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. కియారా అద్వాని హీరోయిన్ గా నటిస్తున్నఈసినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ ఈసినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో జయరామ్, అంజలి, సునీల్, నవీన్ చంద్ర కూడా ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 − five =