పరశురామ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వచ్చిన సినిమా ‘సర్కారు వారి పాట’. మే 12న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలైన ఈసినిమా మొదటి షో నుండే మంచి టాక్ ను సొంతం చేసుకుంది. మరోవైపు ఈసినిమా కలెక్షన్స్ పరంగా పలు రికార్డులు క్రియేట్ చేయడం మొదలుపెట్టింది. రిలీజ్ అయిన మొదటి రోజే ఓవర్సీస్ వన్ మిలియన్ మార్క్ ను దాటి నాన్ ఆర్ఆర్ఆర్ రికార్డులు క్రియేట్ చేసింది. ఇక మరోవైపు మొదటిరోజే ప్రపంచ వ్యాప్తంగా ఈసినిమా 75 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది. ప్రస్తుతం చిత్రయూనిట్ అయితే సక్సెస్ సెలబ్రేషన్స్ ను చేసుకుంటూ ఎంజాయ్ చేస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పటికే ఈసినిమాపై చూసిన హరీష్ శంకర్ ఇంకా రాఘవేంద్ర రావు స్పందించి ప్రశంసలు కురిపించారు. ఇప్పుడు ఈ లిస్ట్ లో గోపీచంద్ మలినేని కూడా చేరిపోయారు. గోపీచంద్ మలినేని కూడా ఈసినిమా చూసి ప్రశంసలు కురిపించారు. సర్కారు వారి పాట చిత్రం లో సూపర్ స్టార్ మహేష్ ను చూడటం ఫీస్ట్ లా ఉంది. స్క్రీన్ పై మహేష్ టైమింగ్ అన్ మ్యాచబుల్.. అంతేకాక కీర్తి సురేష్ తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. డైరెక్టర్ పరశురామ్ డైలాగ్స్ సూపర్ ఇంకా బావ థమన్ ఎప్పటిలాగే తన బెస్ట్ ఇచ్చాడు అంటూ చెప్పుకొచ్చారు. అంతేకాక చిత్ర యూనిట్ కి కంగ్రాట్స్ తెలిపారు.
#SarkaruVaariPaata feast to watch😍 @urstrulyMahesh Garu on screen his timing is unmatchable @KeerthyOfficial nailed her role .@ParasuramPetla ur dialogues 👌.. and my Bawa @MusicThaman as usually gave his best ..lastly congratulations to my producers @MythriOfficial and team 👍
— Gopichandh Malineni (@megopichand) May 13, 2022
కాగా ఈసినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. ఇప్పటి వరకూ చేయని పాత్రలో కాస్త విభిన్నంగా ఈసినిమాలో నటించింది కీర్తి సురేష్. మైత్రీ మూవీ మేకర్స్ , 14 రీల్స్ ప్లస్ , జిఎంబి ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై ఈసినిమాను నిర్మించారు. సముద్ర ఖని, వెన్నెల కిషోర్, నదియా, సుబ్బరాజు,అజయ్, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి, పోసాని కృష్ణ మురళీ, మహేష్ మంజ్రేకర్, రవి ప్రకాశ్, సత్యం ప్రకాశ్ పలు పాత్రల్లో నటించారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: