మన తెలుగు సినిమాలకు ఇప్పుడు నార్త్ లో ఎంత డిమాండ్ పెరిగిందో చూస్తూనే ఉన్నాం. ఇక్కడ హిట్ అయిన చాలా సినిమాలు ఇప్పుడు హిందీలో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చాలా సినిమాలు రీమేక్ అయి రిలీజ్ కూడా అయ్యాయి. ఇక ఈనేపథ్యంలో తెలుగు హిట్ అయి హిందీ లో రీమేక్ అవుతున్న మరో సినిమా హిట్ మూవీ. శైలేష్ కొలను దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘హిట్’. ఈసినిమా తెలుగులో సూపర్ హిట్ అయింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా హిందీలో ఈసినిమాను ఇప్పటికే ప్రారంభించారు కూడా. డైరెక్టర్ శైలేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రాజ్ కుమార్ రావు హీరోగా నటిస్తుండగా.. సన్యా మల్హోత్రా హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే షూటింగ్ కూడా పూర్తి చేసుకున్న ఈసినిమా.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. అయితే తాజాగా ఈసినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించారు చిత్రయూనిట్. జూన్ 15 2022 లో ఈసినిమాను రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. కాగా ఈసినిమాను నిర్మాతలు దిల్ రాజు, భూషణ్ కుమార్ నిర్మిస్తున్నారు.
Hitting the theatres with HIT – The First Case, with a new release date 15th July 2022@RajkummarRao @sanyamalhotra07 @KolanuSailesh #BhushanKumar @TSeries @DilRajuProdctns @SVC_official #KrishanKumar @kuldeeprathor9 @tuneintomanan #ShivChanana pic.twitter.com/1RGqQOufTq
— Dil Raju Productions (@DilRajuProdctns) May 13, 2022



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
తెలుగు ఫుల్ మూవీస్
Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.