పాన్ ఇండియా “లైగర్ ” మూవీ తరువాత విజయ్ దేవరకొండ కథానాయకుడిగా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై కుటుంబ కథా చిత్ర దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ “#VD 11″మూవీ పూజ కార్యక్రమంతో ప్రారంభం అయ్యింది. సమంత కథానాయిక. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ లో సచిన్ ఖేద్కర్ , మురళీశర్మ , లక్ష్మి ,అలీ , రోహిణి , వెన్నెల కిషోర్ , రాహుల్ రామకృష్ణ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. హేషం అబ్దుల్ వాహెబ్ సంగీతం అందిస్తున్నారు.దర్శకుడు హరీష్ శంకర్ క్లాప్ , దర్శకుడు బుచ్చిబాబు సానా స్విఛ్ ఆన్ తో ప్రారంభం అయిన “#VD 11″మూవీ రెగ్యులర్ షూటింగ్ కశ్మీర్ లో జరుగుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ రోజు క్రేజీ హీరో విజయ్ దేవరకొండ బర్త్ డే సందర్భంగా అభిమానుల , సినీ ప్రముఖుల బర్త్ డే విషెస్ సోషల్ మీడియా లో వెల్లు వెత్తుతున్నాయి. తాజాగా విజయ్ బర్త్ డే సందర్భంగా సమంత కూడా సోషల్ మీడియా ద్వారా విషెస్ తెలియజేశారు. లైగర్ విజయ్ దేవరకొండ మీకు పుట్టిన రోజు శుభాకాంక్షలనీ , ఈ ఏడాది రాబోతున్న ప్రశంసలకు నువ్వు సంపూర్ణ అర్హుడివనీ , విజయ్ నువ్వు ఎందరికో స్ఫూర్తిదాయకం , ప్రేరణ.అనీ , గాడ్ బ్లెస్ యూ అంటూ ఒక స్పెషల్ ఫోటోను సమంత ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేయగా ఆ ఫోటో వైరల్ గా మారింది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
తెలుగు ఫుల్ మూవీస్
Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.