#VD11 ఫస్ట్ లుక్ అనౌన్స్ మెంట్..!

VD11 Movie First Look Announcement,VD11 Starring Vijay Deverakonda And Samantha First Look Announcement,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, VD11 Movie,VD11 Movie Telugu Movie,VD11 Movie Movie Updates,VD11 Movie latest News,VD11 Movie Upcoming Movies,VD11 Movie First Look Announcment, VD11 Telugu Movie,Vijay Deverakonda Movie Updates,Vijay Deverakonda VD11 Movie Updates,Vijay Deverakond and Samntha VD11 Updates

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ నుండి కూడా సినిమా వచ్చి చాలా రోజులైపోయింది దీంతో ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈఏడాది కనీసం రెండు సినిమాలు మాత్రం రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు విజయ్. అందులో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వస్తున్న లైగర్ సినిమా ఇప్పటికే రిలీజ్ కు సిద్దమవుతుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుండగా ఆగష్ట్ 25న ఈసినిమా రిలీజ్ అవ్వబోతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ రోజు విజయ్ దేవరకొండ పుట్టిన రోజు సందర్భంగా విజయ్ బర్త్ డే సెలబ్రేషన్స్ గ్రాాండ్ గా జరుగుతున్నాయి. దీనితో పాటు విజయ్ కొత్త సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ కూడా వస్తున్నాయి. ఇక VD11 టీమ్ కూడా విజయ్ బర్త్ డే ను సెలబ్రేట్ చేశారు. రీసెంట్ గానే టీమ్ ప్రాంక్ తో సామ్ బర్త్ డేను సెలబ్రేట్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే చిత్ర బృందం గ్రాండ్‌గా విజయ్ పుట్టినరోజును సెలబ్రేట్ చేశారు. సమంత, విజయ్ దేవరకొండ, శివ నిర్వాణ, నిర్మాత వైవి రవిశంకర్ ఇంకా వెన్నెల కిషోర్ కేక్ కట్ చేసి విజయ్ కు విషెస్ అందించారు. అంతేకాదు ఈసందర్భంగా ఫస్ట్ లుక్ అప్ డేట్ ను కూడా ఇచ్చారు. మే 16వ తేదీన ఈసినిమా నుండి టెర్రిఫిక్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయబోతున్నట్టు తెలిపారు.

కాగా శివ నిర్వాణ దర్శకత్వంలో వస్తున్న ఈసినిమాలో విజయ్ దేవరకొండ, సమంత ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా వెన్నెల కిషోర్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం కశ్మీర్‌లో జరుగుతుంది.

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten − 4 =