టాలీవుడ్ లో ఇప్పటికే ఎంతో మంది బయోపిక్ లు తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు మరో బయోపిక్ తో వచ్చేస్తున్నాడు టాలీవుడ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్. 26/11 ముంబై ఉగ్రదాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితాధారంగా మేజర్ సినిమా రూపొందింది. ఈ బ్యాక్ డ్రాప్ లో ఎప్పుడో సినిమా తీయాలనుకున్న అడివి శేష్.. దానికి సంబంధించి ఎన్నో వివరాలు, రీసెర్చ్ లు చేసి మరీ ఫైనల్ గా సినిమాను తీశాడు. ఇక ఈసినిమా జూన్ 3వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈనేపథ్యంలో ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు. ఇప్పటికే పలు పాటలు, టీజర్ కూడా రిలీజ్ చేశారు మేకర్స్. అవి బాగానే ఆకట్టుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఒక్కో భాషలో ఒక్కో స్టార్ హీరో ఈ చిత్ర ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. తెలుగులో మహేష్ బాబు, హిందీలో సల్మాన్ ఖాన్, మలయాళంలో పృథ్వీరాజ్ సుకుమారన్ విడుదల చేశారు .బోర్డర్ దాటి పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌కు వెళ్లడం ఏంటి’ అనే డైలాగ్‌తో మేజర్ ట్రైలర్ మొదలవుతుంది. ‘వాళ్లు మంచివాళ్లు కాదు.. పెద్దపెద్ద తప్పులు చేసేవాళ్లు’, ‘ఇండియన్ ఆర్మీ అంటే బయమేస్తుందిరా.. నీకేమన్నా అయితే’, ‘సందీప్ ఆర్మీలో జాయిన్ కావడం నాకు ఇష్టం లేదు’, ‘వాడికి మంచి కొడుకుగా, భర్తగా ఉండటంకంటే.. ఒక సోల్జర్‌గా ఉండడం అవసరం’ అనే డైలాగ్స్ అందరిని ఆకట్టుకున్నాయి. ఇక చివర్లో చెప్పిన డైలాగ్ ‘తప్పించుకునే దారి ఉంది.. ముందుకెళ్తే చనిపోతామని తెలుసు.. అయినా కూడ వెళ్లాడు. చావు కళ్లల్లోకి చూసి.. నువ్వు నా జీవితాన్ని తీసుకోవచ్చు గానీ నా దేశాన్ని కాదు’ అని ప్రకాష్ రాజ్ చెప్పిన డైలాగ్ అందరి కంట హైలెట్ గా నిలుస్తుంది.
The Stars have aligned.
The #MajorTrailer
has EXPLODED.🇮🇳 Here You Go.
Teluguhttps://t.co/zrBm7W2Hr9
Malayalamhttps://t.co/HP7A7wNBku#JaanDoongaDeshNahi#MajorOnJune3rd pic.twitter.com/YQm9SQkXvM
— Adivi Sesh (@AdiviSesh) May 9, 2022
ఈ సినిమాలో శోభితా ధూళిపాళ్లతో పాటు సయీ మంజ్రేకర్ కూడా మరో కథానాయికగా నటిస్తుంది. ప్రకాష్ రాజ్, రేవతి, మురళి శర్మ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. మహేష్ హోమ్ బేనర్ జీఎంబీ ప్రొడక్షన్స్ సోనీ పిక్చర్స్‌తో కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శ్రీచరణ్ పాకాల ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, మలయాళంలో కూడా రిలీజ్ చేయనున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: