సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ– స్టార్ దర్శకుడు పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా లైగర్. ఇటీవలే ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఒక బోల్డ్ డైరెక్టర్-ఒక బోల్డ్ యాక్టర్ అయిన విజయ్-పూరీ లాంటి క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా అవ్వడంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఆగష్ట్ 25వ తేదీన ఈసినిమా రిలీజ్ అవుతుండటంతో మరోపక్క ప్రమోషన్స్ ను కూడా స్టార్ట్ చేసే పనిలో పడ్డారు మేకర్స్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక నేడు విజయ్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా ఈసినిమా నుండి కూడా అప్ డేట్ వచ్చేసింది. మే 9వ తేదీన ఈసినిమా నుండి అప్ డేట్ ఇస్తున్నట్టు రెండు రోజుల క్రితమే ప్రకటించారు చిత్రయూనిట్. ఈనేపథ్యంలోనే నేడు చిత్ర యూనిట్ లైగర్ హంట్ థీమ్ లిరికల్ వీడియోను విడుదల చేసింది. ఈ హంట్ థీమ్ లో విజయదేవర కొండ లుక్, యాక్షన్ నెక్స్ట్ లెవల్ లో వున్నాయి. సిక్స్ ప్యాక్ దేహంతో మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ ని ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు విజయ్ దేవరకొండ. వీడియోతో పాటు విడుదల చేసిన స్పెషల్ పోస్టర్ కూడా ఫ్యాన్స్ ని ఆకట్టుకుంది. ఈ హంట్ థీమ్ ని విక్రమ్ మాంట్రోస్ కంపోజ్ చేయగా హేమచంద్ర ఫుల్ ఎనర్జీటిక్ గా పాడారు. భాస్కరభట్ల అందించిన సాహిత్యం అద్భుతంగా కుదిరింది.
Today we start our Pan Indian hunt
Here’s the #LIGERHUNT (Telugu)
▶️https://t.co/GtoPBUrPyL#HBDVijayDeverakonda@TheDeverakonda @MikeTyson @ananyapandayy @karanjohar #PuriJagannadh #LIGER pic.twitter.com/FcaWS5GQNt— Puri Connects (@PuriConnects) May 9, 2022
ఈ సినిమాలో విజయ్ దేవరకొండకు జోడీగా అనన్య పాండే నటిస్తుండగా. బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ కీలక పాత్రలో నటించనున్నారు. రమ్యకృష్ణ తోపాటు బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాను పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో తెరకెక్కిస్తున్నారు.




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: