వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో న్యాచురల్ స్టార్ నాని, మలయాళ బ్యూటీ హీరోయిన్ నజ్రియా కాంబినేషన్ లో వచ్చిన సినిమా అంటే సుందరానికి. ఇక ఈసినిమా ఒక పక్క రిలీజ్ కు సిద్దమవుతూనే మరోపక్క ప్రమోషన్స్ ను కూడా స్టార్ట్ చేసింది. ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్స్ సినిమాపై ఆసక్తిని పెంచాయి. మరోవైపు మ్యూజికల్ ప్రమోషన్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. దీనిలోభాగంగానే ఈసినిమా నుండి ఫస్ట్‌సింగిల్ పేరుతో విడుదలైన పంచెకట్టు సాంగ్ మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు సెకండ్ సింగిల్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఎంత చిత్రం అనే డ్యూయేట్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
The dazzling melody #EnthaChithram from #AnteSundaraniki is here..
Celebrate Love like never before ♥️
– https://t.co/FDVQ1z3PtG@NameisNani #NazriyaFahadh #VivekAthreya @oddphysce @anuragkulkarni @ramjowrites @keerthanavnath @saregamasouth pic.twitter.com/Ud6DmGPRHw
— Mythri Movie Makers (@MythriOfficial) May 9, 2022
కాగా ఈసినిమాలో నదియ,హర్ష వర్ధన్,రాహుల్ రామకృష్ణ,సుహాస్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమాను మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవి శంకర్ లు నిర్మిస్తున్నారు. వివేక్ సాగర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. నికేత్ బొమ్మి సినిమాటోగ్రాఫర్. జూన్ 10వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
తెలుగు ఫుల్ మూవీస్
Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.