బ్లాక్ బస్టర్ “ఫిదా ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన సాయి పల్లవి , ఆ మూవీ లో తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ , డ్యాన్స్ లతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. నటనకు ప్రాధాన్యత ఉన్న మూవీస్ ను ఎంపిక చేసుకుంటున్న సాయి పల్లవి కథానాయికగా రూపొందిన”లవ్ స్టోరీ“, “శ్యామ్ సింగరాయ్” మూవీస్ ఘనవిజయం సాధించాయి. ఆ మూవీస్ లో సాయి పల్లవి అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. సాయి పల్లవి కథానాయికగా తెరకెక్కిన ”విరాటపర్వం “మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఒక తమిళ మూవీ , ఒక కన్నడ మూవీ కి సాయి పల్లవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
టాలెంటెడ్ యాక్ట్రెస్ సాయి పల్లవి బర్త్ డే సందర్భంగా ఒక కొత్త సినిమా అనౌన్స్ అయ్యింది. గౌతమ్ రామచంద్రన్ దర్వకత్వంలో సాయి పల్లవి ప్రధాన పాత్రలో ఉమెన్ సెంట్రిక్ మూవీ గా తమిళ, తెలుగు భాషలలో “గార్గి “మూవీ తెరకెక్కుతుంది. గోవిందా వసంత సంగీతం అందిస్తున్నారు. సాయి పల్లవి బర్త్ డే సందర్భంగా “గార్గి “మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ , గ్లింప్స్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.
సాయి పల్లవి న్యూ మూవీ అనౌన్స్ మెంట్ తో అభిమానులు తమ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: