డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , అలియా భట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ , ఒలీవియా మోరిస్ జంటలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన హై ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ “రౌద్రం రణం రుధిరం ” మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా 10,000కు పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్, కొమరం భీమ్ గా ఎన్టీఆర్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన “ఆర్ ఆర్ ఆర్ ” మూవీ రిలీజ్ అయిన మొదటి రోజే 200 కోట్లకు పైగా కలెక్ట్ చేసి 200కోట్ల క్లబ్ లో చేరింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
“ఆర్ ఆర్ ఆర్ ” మూవీ ప్రపంచవ్యాప్తంగా 1120 కోట్ల కు పైగా , బాలీవుడ్ లో 250 కోట్లకు పైగా , ఓవర్సీస్ లో 15 మిలియన్ డాలర్స్ కు పైగా కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. “ఆర్ ఆర్ ఆర్ “మూవీ నేపాల్ దేశంలో రిలీజ్ అయిన మొదటి రోజునుండీ సూపర్ హిట్ టాక్ తో భారీ కలెక్షన్స్ తో ప్రదర్శించబడుతుంది. ఇప్పటి వరకూ సుమారు 15 కోట్లు కలెక్ట్ చేసినట్టు సమాచారం. “ఆర్ ఆర్ ఆర్ “మూవీకి నేపాల్ దేశంలో నేపాలీస్ బ్రహ్మరథం పడుతున్నారు. “ఆర్ ఆర్ ఆర్ ” మూవీ లో రామ్ చరణ్ , ఎన్టీఆర్ ల పెర్ఫార్మెన్స్ నేపాలీస్ ను మెస్మరైజ్ చేసి, వారి పై క్రేజ్ పెరిగేలా చేసింది. తాజాగా అల్లూరి సీతారామరాజు గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన రామ్ చరణ్ పోస్టర్ ను నేపాల్ లో ఓ ప్రముఖ న్యూస్ పేపర్ ఫ్రంట్ పేజి లో వెయ్యడం ఆసక్తిగా మారింది. అక్కడి పేపర్ లో టాలీవుడ్ కి చెందిన ఓ హీరో పోస్టర్ ఫ్రంట్ పేజి ఫుల్ గా వెయ్యడంతో చరణ్ అభిమానులు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: