ఇప్పుడు ప్రస్తుతం పాన్ ఇండియా టాపిక్ పై ఎంత పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయో చూస్తూనే ఉన్నాం. జాన్ అబ్రహం నుండి మొదలైన ఈ రచ్చ రోజు రోజుకు పెరుగుతుంది కానీ తగ్గట్లేదు. ఇప్పటికే ఈ పాన్ ఇండియా టాపిక్ పై ఎంతోమంది సెలబ్రిటీలు స్పందించారు కూడా. సౌత్ సినిమాలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా మంచి ఫలితాలు రాబట్టుకుంటున్నాయి. మరోవైపు బాలీవుడ్ సినిమాలు ఒకటి రెండు తప్పా పెద్దగా బాక్సాఫీస్ ను కొల్లగొట్టిన పరిస్థితులు లేదు. అంతేకాదు పెద్ద ఎత్తున సౌత్ సినిమాలను రీమేక్ చేసుకునే పరిస్థితి వచ్చింది. ఇక్కడ మొదలైన ఈవివాదం కాస్త చాలా దూరమే వెళ్లింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు వివాదాలకు కాస్త దగ్గరగా ఉండే సిద్దార్థ్ కూడా స్పందించాడు. సినీ పరిశ్రమలో ఇప్పుడు పాన్ ఇండియా అనే పదం వాడకం ఎక్కువయిందని.. పాన్ ఇండియా సినిమా అని పిలవడం అగౌరవకరమని… దీని బదులు ఇండియన్ సినిమా అనడం చాలా గొప్పగా ఉంటుందని అన్నారు. మణిరత్నం ఎన్నో ఏళ్ల క్రితం తెరకెక్కించిన ‘రోజా’ చిత్రాన్ని దేశమంతా చూసిందని… దాన్ని ఎవరూ పాన్ ఇండియా మూవీ అని పిలవలేదని చెప్పారు. పాన్ ఇండియా అనేది ఒక నాన్సెన్స్ అని అన్నారు.
యష్, ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ‘కె.జి.యఫ్’ సినిమా విషయంలో చాలా గర్వపడుతున్నానని.. కన్నడ సినీ పరిశ్రమలో రూపొందిన భారతీయ సినిమా ఇదని… ఏ సినిమానైనా భారతీయ సినిమాగానే పిలవాలని… లేదా ఏ భాషలో తెరకెక్కితే ఆ భాషా చిత్రంగా పరిగణించాలని సిద్ధార్థ్ అన్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: