మగధీర : గీతా ఆర్ట్స్ బ్యానర్ పై రాజమౌళి దర్శకత్వంలో హీరో రామ్ చరణ్ , కాజల్ అగర్వాల్ ఫస్ట్ టైమ్ జంటగా రూపొందిన ఫాంటసీ , యాక్షన్ మూవీ “మగధీర “ఘనవిజయం సాధించి 150 కోట్ల క్లబ్ లో చేరింది. 1000 రోజుల థియేట్రికల్ రన్ తో “మగధీర ” మూవీ రికార్డ్ క్రియేట్ చేసింది. కాలభైరవ , హర్షగా ద్విపాత్రాభినయం తో రామ్ చరణ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తన రెండవ మూవీ “మగధీర ” లో తన అద్భుతమైన డ్యాన్స్ , ఫైట్స్ తో ప్రేక్షకులను రామ్ చరణ్ అలరించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ధృవ :గీతా ఆర్ట్స్ బ్యానర్ పై సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ చరణ్ , రకుల్ ప్రీత్ సింగ్ జంటగా రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ “ధృవ “మూవీ ప్రేక్షకాదరణ పొంది కమర్షియల్ గా సక్సెస్ అయ్యింది. ధృవ అనే పోలీసాఫీసర్ పాత్రలో హీరో రామ్ చరణ్ తన స్టైలిష్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. రామ్ చరణ్ చాలా బాగా నటించారు .ఆ పాత్ర కోసం ఎంతోకష్టపడి బిల్డప్ చేసిన ఫిజిక్‌తో చరణ్ స్క్రీన్ ప్రెజెన్స్ ప్రేక్షకులను అలరించింది.
రంగస్థలం: మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ ,సమంత జంటగా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా “రంగస్థలం ” మూవీ ఘనవిజయం సాధించింది. చిట్టిబాబు పాత్రలో రామ్ చరణ్ ఎక్కడా తడబడకుండా శబ్దాలకు వినికిడి లోపం ఉన్నవాళ్లు ఎలాగైతే స్పందిస్తుంటారో అలానే స్పందిస్తూ, గోదావరి యాసలో మాట్లాడుతూ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. ఈ మూవీ కి రామ్ చరణ్ బెస్ట్ యాక్టర్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు.
ఆర్ ఆర్ ఆర్ : డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలు గా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా “రౌద్రం రణం రుధిరం ” మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన పవర్ ఫుల్ యాక్టింగ్ టాలెంట్ తో ప్రేక్షకులను అలరించారు.
ఆచార్య:సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి హీరో గా భారీ బడ్జెట్ తో రూపొందిన “ఆచార్య “మూవీ ఏప్రిల్ 29 వ తేదీ భారీ అంచనాలతో రిలీజ్ అయ్యి ప్రేక్షకుల అంచనాలను చేరుకోలేకపోయింది . ఈ మూవీ లో రామ్ చరణ్ డిఫరెంట్ షేడ్స్ తో ఉన్న సిద్ధ క్యారెక్టర్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటున్నారు.రామ్ చరణ్ కు జోడీగా పూజాహెగ్డే నటించారు. వారిద్దరి కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించింది.
[totalpoll id=”79428″]




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: