ప్రముఖ నిర్మాత దిల్ రాజు ,స్టార్ డైరెక్టర్ హరీశ్ శంకర్, జీ5 సంస్థ సంయుక్త నిర్మాణంలో సి చంద్ర మోహన్ దర్శకత్వంలో వీజే సన్నీ, దివి జంటగా దొంగతనాల నేపథ్యంలో తెరకెక్కుతున్న “ATM ” వెబ్ సిరీస్ పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. మెగా ప్రొడ్యూసర్ దిల్ రాజు కుటుంబం నుండి హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి ఈ వెబ్ సిరీస్ తో నిర్మాతలుగా మారుతున్నారు. దిల్ రాజు క్లాప్ కొట్టగా, హరీశ్ శంకర్ స్క్రిప్ట్ ను అందించారు. ఈ పూజా కార్యక్రమానికి వీజే సన్నీ, నటుడు సుబ్బరాజు, ప్రశాంత్ విహారి, హన్షిత రెడ్డి తదితరులు హాజరయ్యారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఒక థ్రిల్లర్ కథతో తెరకెక్కుతున్న “ఏటీఎమ్” వెబ్ సిరీస్ కు ప్రశాంత్ విహారి సంగీతం అందిస్తున్నారు. సినిమాటోగ్రఫీ పీజీ విందా అందిస్తున్నారు. “ఏటీఎమ్” వెబ్ సిరీస్ కు ప్రముఖ దర్శకుడు స్క్రిప్ట్ అందించారు. ఏప్రిల్ 27 నుంచి రెగ్యూలర్ షూటింగ్ జరగనున్న “ATM ” వెబ్ సిరీస్ పూర్తి వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: