“#RC 16 “మూవీ పై రామ్ చరణ్ క్లారిటీ

Ram Charan gives clarity about #RC16,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Mega Power Star Ram Charan,Ram Charan movie Updates,Ram Charan latst movies,Ram Charan Upcoming movies,Ram Charan New Movie Updates,Ram Charan, Ram Charan #RC16 Movie Updates,Ram Charan #RC16 latest News,Ram Charan About #RC16,Ram Charan Clarity about #RC16,Ram Charan Gives Clarity on #RC16 movie

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిన “ఆర్ ఆర్ ఆర్ “మూవీ భారీ కలెక్షన్స్ తో ప్రదర్శించబడుతున్న విషయం తెలిసిందే. మెగా స్టార్ చిరంజీవి , రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కిన “ఆచార్య “29 వ తేదీ రిలీజ్ కానుంది. రామ్ చరణ్ ప్రస్తుతం శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై భారీ చిత్ర దర్శకుడు శంకర్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న “#RC15” మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. హీరో రామ్ చరణ్ యువ ఐఏఎస్ గా ఒక డైనమిక్ రోల్ లో నటిస్తున్న ఈ మూవీ లో కియారా అద్వానీ కథానాయిక.”#RC15” మూవీ కి థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

#RC15 ” మూవీ హైదరాబాద్‌, పూణె, రాజమండ్రి , అమృత్ సర్ షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఒక ఇంటర్వ్యూ లో రామ్ చరణ్ మాట్లాడుతూ .. “#RC16” మూవీ గురించి కొన్ని విషయాలను తెలిపారు. దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తన మైండ్ లో ఒక కథ ఫిక్స్ అయి తనని అప్రోచ్ అయ్యాడనీ , కానీ మీకు ఏ జోనర్ చేయాలనుందని అడిగాడనీ , గౌతమ్ సినిమా అంటే కచ్చితంగా స్ట్రాంగ్ ఎమోషన్ ఉంటుందనీ , కేవలం మూడు క్యారెక్టర్స్ తో తను “జెర్సీ” అనే మంచి సినిమా తీసాడనీ , అందుకే తనని నమ్మి తను ఎలాంటి కథ అనుకున్నాడో అదే చేద్దామని చెప్పాననీ , శంకర్ తో చేస్తున్న సినిమా దాదాపు 60 శాతం షూట్ కంప్లీట్ చేసుకుందనీ , దాని తర్వాతే గౌతమ్ తో సినిమా ఉంటుందనీ , అలాగే తమ కాంబో సినిమా స్పోర్ట్స్ డ్రామా కాదని వేరే జోనర్ సినిమా అనీ క్లారిటీ ఇచ్చారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.