దేశ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో కె.జి.యఫ్ 2 కూడా ఒకటి. ఈసినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా.. ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎదురుచూస్తున్నారు. ఇక ఫైనల్ గా ఆ టైమ్ రానే వచ్చేసింది. ఎన్నో అంచనాల మధ్య నేడు ఈసినిమా భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈసినిమా ఎలా ఉంది.. మొదటి పార్ట్ ను మించేలా ఉందా..? లేదా..? ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంది అన్న విషయం తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
నటీనటులు.. యష్, శ్రీనిధి శెట్టి, సంజయ్ దత్, రవీనా టాండన్, ప్రకాష్ రాజ్, రావు రమేష్, ఈశ్వరీ రావు తదితరులు
డైరెక్టర్..ప్రశాంత్ నీల్
బ్యానర్..హోంబలే ఫిలిమ్స్
నిర్మాత..విజయ్ కిరగందూర్
సంగీతం..రవి బస్రూర్
సినిమాటోగ్రఫి..భువన గౌడ
కథ.. ఈసినిమా కె.జి.యఫ్ 1 కు సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే. కె.జి.యఫ్ 1 ఎక్కడ ఎండ్ అయిందో అక్కడి నుండి పార్ట్ 2 మొదలవుతుంది. గరుడను చంపిన తర్వాత నరాచిని తన చేతిలోకి తీసుకుంటాడు రాకీ భాయ్ (యష్). అయితే తనకు ఎదురులేదని అనుకుంటున్న సమయంలో నరాచిపై ఎప్పటినుండో కన్ను వేసిన..సూర్యవర్ధన్ సోదరుడు అధీరా (సంజయ్ దత్) ఎంట్రీ ఇస్తాడు. మరోవైపు ప్రధాన మంత్రి రమికా సేన్ (రవీనా టాండన్) కూడా రాఖీభాయ్ సామ్రాజ్యం కూలగొట్టడానికి చూస్తుంటుంది. మరి ఒకవైపు అధీరా… మరోవైపు రమికా సేన్… మధ్యలో ఎదురయ్యే అడ్డంకులను రాకీ భాయ్ ఏ విధంగా ఎదుర్కొన్నాడు? చివరికి, ఏం చేశాడు? అనేది మిగతా సినిమా.
విశ్లేషణ..
ఇక ఈసినిమా కోసం అందరూ ఎందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో.. ఈసినిమాపై ఎంత ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయో అందరికీ తెలిసిందే. దానిగురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కారణం నాలుగేళ్ల క్రితం వచ్చిన కె.జి.యఫ్ చాప్టర్ 1. ఈసినిమా అప్పట్లో సంచలనాలు క్రియేట్ చేసింది. కన్నడ సినీ చరిత్రలోనే కొత్త రికార్డులు సృష్టించింది. కేవలం కన్నడలోనే కాదు సౌత్ లోనే పలు భాషల్లో అలానే నార్త్ లో కూడా మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది. బాహుబలి తర్వాత ఆరేంజ్ లో రికార్డులు క్రియేట్ చేసిన సినిమా ఇదే. అలాంటి నేపథ్యంలో ఈసినిమాపై అంచనాలు ఉండటం కామనే కదా..
ఈసినిమా విషయానికి వస్తే సినిమాలో కూడా మాస్ సీన్స్, యాక్షన్ సన్నివేశాలు, ఎలివేషన్స్, మదర్ సెంటిమెంట్ వంటి అంశాలపై దర్శకుడు ప్రశాంత్ నీల్ ఫోకస్ చేస్తూ పక్కాగా కె.జి.యఫ్2 ను సిద్ధం చేసుకున్నాడు. ఫస్టాఫ్ లో తను ఎదిగిన తీరు చూపించి.. సెకండ్ హాఫ్ లో పలు ట్విస్ట్ లతో కథను రాసుకున్నాడు. ఇక ఇంటర్వెల్ బ్యాంగ్, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ కూడా అందరినీ ఆకట్టుకుంటాయి.
ఇక హీరో యష్ గురించి చెప్పేదేముంది. యష్ లేకపోతే ఈసినిమా లేనట్టే. రాకీ భాయ్ పాత్రలో యష్ ను తప్ప మరొకరిని ఊహించుకోవడం కష్టమే. ఎప్పటిలాగే తన యాక్షన్ తో అదరగొట్టాడు. ఇందులో మరింత స్టైలీష్‌గా, తనదైన మేనరిజంలో డైలాగ్స్ చెబుతూ..అదరగొట్టేశాడు. ఇక యాక్షన్ సీక్వెల్స్ లో ఎలా అయితే చెలరేగిపోయాడో అలానే మదర్ సెంటిమెంట్ సీన్స్, లవ్ సీన్స్ కూడా బాగా చేశాడు. ఇక ఈసినిమాలో చాలా మంది సీనియర్ నటీనటులే కీలకపాత్రలో పోషించగా అందులో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది రవీనా టాండన్, సంజయ్ దత్ గురించి. యష్ తరువాత వీరిద్దరి పాత్రలు హైలెట్ గా నిలిచాయి. రవీనా టాండన్ రోల్ చాలా పవర్ ఫుల్ గా చూపించారు. అధీరా పాత్రను కూడా బాగా చూపించాడు. ఇక రావు రమేశ్, ఈశ్వరి రావు, ప్రకాశ్ రాజ్‌తో పాటు ప్రతి ఒక్కరు తమ తమ పాత్రల పరిధిమేర నటించారు. ప్రతి ఒక్కరి పాత్రకి తగిన ప్రాధాన్యతను ఇచ్చాడు డైరెక్టర్.
ఇక ఇలాంటి సినిమాలకు సాంకేతిక విభాగం ఎంత కీలక పాత్ర పోషిస్తుందో చెప్పనక్కర్లేదు. డైరెక్టర్ కూడా వారిదగ్గరనుండి తనకు కావాల్సిన అవుట్ పుట్ ను రాబట్టుకోవడంలో సక్సెస్ అయ్యాడు. రవి బస్రూర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకే హైలెట్ గా నిలిచింది.భువన్ గౌడ సినిమాటోగ్రఫి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. కేజీయఫ్ సామ్రాజ్యాన్ని అందంగా చిత్రీకరించాడు. ప్రతి సీన్‌ని తెరపై చాలా రిచ్‌గా చూపించాడు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి.
ఓవరాల్ గా చెప్పాలంటే అభిమానులకు, కమర్షియల్, మాస్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు ఈసినిమా ఆకట్టుకుంటుంది. యాక్షన్ ఎలివేషన్స్ ఎక్కువగా ఉండటంతో ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అవ్వడం కొంచం కష్టం.



[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: