బాలీవుడ్ హీరోయిన్ సోనాల్ చౌహన్ ఒకపక్క హిందీలో సినిమాలు చేస్తూనే మరోపక్క తెలుగులో కూడా అవకాశాలు దక్కించుకుంటుంది. ఇప్పటికే తెలుగులో పలు సినిమాలు చేసింది సోనాల్. ఒక్క బాలకృష్ణతోనే లెజెండ్, డిక్టేటర్, రూలర్ సినిమాల్లో నటించింది. ప్రస్తుతం తెలుగులో ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగార్జున హీరోగా వస్తున్న ఘోస్ట్ సినిమాలో నటిస్తుంది. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక ఈసినిమాతో పాటు ‘ఎఫ్3’ సినిమాలో కూడా ఒక పాత్రలో నటిస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: ![👇](https://s.w.org/images/core/emoji/11/svg/1f447.svg)
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలాఉండగా తాజాగా మరో క్రేజీ ప్రాజెక్టులో ఆఫర్ దక్కించుకుంది సోనాల్. ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వస్తున్న సినిమా ఆది పురుష్. ఇందులో రాముని పాత్రలో ప్రభాస్ నటించగా.. సీతగా కృతి సనన్.. రావణుడిగా సైఫ్ అలీఖాన్ కనిపించబోతున్నారు. అలాగే లక్ష్మణుడి పాత్రలో బాలీవుడ్ యంగ్ హీరో సన్నీ సింగ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈసినిమా షూటింగ్ పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇక ఈసినిమాలో సోనాల్ కూడా నటించే ఛాన్స్ కొట్టేసినట్టు తెలుస్తుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సోనాల్ ఇప్పటివరకూ నేను నటించిన సినిమాలతో చూస్తే ఆదిపురుష్ స్పెషల్ సినిమా. ఈ సెట్ లో మరో ప్రపంచాన్ని చూశాను. నా తొలి పౌరాణిక సినిమా ఇది. ఈ సినిమాలో ప్రభాస్ సరసన నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. ఆదిపురుష్ సినిమా మీకు సరికొత్త అనుభూతిని కలిగిస్తుంది” అని తెలిపింది. మరి మేకర్స్ సోనాల్ గురించి అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఏమన్నా ఇస్తారేమో చూడాలి.
![Video thumbnail](https://img.youtube.com/vi/e39EebWvqFA/default.jpg)
![Video thumbnail](https://img.youtube.com/vi/yXdI03vZlxw/default.jpg)
![Video thumbnail](https://img.youtube.com/vi/VSNJSi-PBtM/default.jpg)
![Video thumbnail](https://img.youtube.com/vi/PyuFB7TWN8w/default.jpg)
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:![👇](https://s.w.org/images/core/emoji/11/svg/1f447.svg)