పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న సుకుమార్ కు అభిమాన గణం అధికమే. బ్లాక్ బస్టర్ “పుష్ప :ది రైజ్”మూవీ తో దర్శకుడు సుకుమార్ కు దేశవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. దర్శకుడు సుకుమార్ ప్రస్తుతం “పుష్ప :ది రూల్ ” మూవీ పనులలో బిజీగా ఉన్నారు. ఇప్పుడు సుకుమార్ వీరాభిమాని సుకుమార్ ను సర్ ప్రైజ్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
“దూరదర్శని ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అవుతున్న నటుడు సువీక్షిత్ బొజ్జా ఎన్నో ఏళ్లుగా దర్శకుడు సుకుమార్‌కి వీరాభిమాని.సువీక్షిత్.. తన సొంత గ్రామమైన ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లాలోని బోరెడ్డిగారి పల్లి గ్రామంలో.. ఆయన తన వ్యవసాయ భూమిలో దాదాపు 50 రోజుల వ్యయప్రయాసలతో..రెండున్నర ఎకరాలలో దర్శకుడు సుకుమార్ రూపం వచ్చేటట్లు వరి పంట సాగు చేశారు.ఆ పంటను సుకుమార్ రూపానికి తీసుకువచ్చి తన అభిమానాన్ని చాటుకున్న సువీక్షిత్ అందరి దృష్టిని ఆకర్షించి హాట్ టాపిక్‌గా మారారు. సుకుమార్ రూపంతో పాటు.. ‘పుష్ప 2’ అని కూడా వరిసాగు చేయడం.. అల్లు అర్జున్ అభిమానులను ఆకట్టుకుంటోంది.డ్రోన్ కెమెరాలతో ఒక వీడియో ను చిత్రీకరించారు. ఆ వీడియో ను వీక్షించిన సుకుమార్ నోట మాట రావడం లేదనీ , కళ్లు చెమర్చాయనీ , ఓ మనిషి మీద ఇంత అభిమానం ఉంటుందా?..’’ అంటూ అందరి సమక్షంలో సువీక్షిత్‌ని అభినందించారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: