మొదటి నుండి డిఫరెంట్ పాత్రలు ఎంచుకుంటూ కెరీర్ లో మంచి సక్సెస్ రేటును దక్కించుకున్న హీరో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. ఇక ఇప్పుడు మరో డిఫరెంట్ స్టోరీతో వస్తున్నాడు. వరుణ్ ప్రధాన పాత్రలో బాక్సింగ్ నేపథ్యంలో వస్తున్న సినిమా గని. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమాలో వరుణ్ సిక్స్ ప్యాక్ చేసి సరికొత్త ఫిజిక్‌తో కనిపిస్తున్నాడు. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటూనే మరోపక్క ప్రమోషన్స్ కూడా చేస్తున్నారు మేకర్స్. ఈసినిమా కి కూడా ఎన్నో సార్లు రిలీజ్ డేట్ ను వాయిదా వేసుకున్నారు. త్వరలోనే ఈసినిమాను రిలీజ్ చేయనున్నారు. ఈనేపథ్యంలోనే మళ్లీ ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెడుతున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక తాాజాగా ట్రైలర్ కు సంబంధించిన అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. త్వరలో ఈసినిమా ట్రైలర్ ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు చిత్రబృందం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఈసినిమాలో హీరోయిన్ గా సయీ మంజ్రేకర్ నటిస్తుండగా నదియా, జగపతిబాబు, ఉపేంద్ర, సునీల్ శెట్టి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణ లో రినైస్సన్స్ పిక్చర్స్, బ్లూ వాటర్స్ క్రియేటివ్ బ్యానర్స్ పై అల్లు బాబీ, సిద్దు ముద్దలు నిర్మిస్తున్నారు. ఈసినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాకు… హాలీవుడ్ స్టంట్ మాస్టర్ లార్నెల్ స్టోవాల్ ఫైట్స్ ను కంపోజ్ చేస్తున్నాడు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: