విక్రమ్ సహిదేవ్, సౌమిక పాండియన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా వర్జిన్ స్టోరీ. ఈసినిమాపై మంచి అంచనాలే ఉండగా.. ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈసినిమా ఎలా ఉంది..ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది అన్నది తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
నటీనటులు..విక్రమ్ సహిదేవ్, సౌమిక పాండియన్, రిషిక ఖన్నా, వినీత్ బవిశెట్టి, స్నేహల్, రాకెట్ రాఘవ, తాగుబోతు రమేష్, జీవా, ఆనంద్ ఠాకూర్ తదితరులు
దర్శకత్వం..ప్రదీప్ బి అట్లూరి
నిర్మాత..శ్రీధర్ లగడపాటి
బ్యానర్..రామలక్ష్మి సిని క్రియేషన్స్
సంగీతం..అచ్చు రాజమణి
సినిమాటోగ్రఫీ.. అనిష్ థరుణ్ కుమార్
ఎడిటింగ్.. గ్యారీ బిహెచ్
కథ..
ఈ కథ హీరోయిన్ బ్రేకప్ సీన్ తో మొదలవుతుంది. ఈనేపథ్యంలో తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ని ఎలా అయిన ఫీల్ అయ్యేలా చేయాలని అనుకుంటుంది పియు ( హీరోయిన్). ఆ క్రమంలో ఒక బార్ లో హీరో విక్కీ ( విక్రమ్ ) తో పరిచయం ఏర్పడుతుంది. విక్కీతో వన్ నైట్ స్టాండ్ కి ప్లాన్ చేస్తుంది. మరి ఆతర్వాత ఏం జరిగింది.. ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి అనేదే ఈసినిమా కథ..
విశ్లేషణ..
ఒకప్పుడు ప్రేమ అంటే దానికి ఒక ప్రాధాన్యత ఉండేది. కానీ రోజులు మారుతున్న కొద్దీ ప్రేమలో మార్పులు వచ్చేస్తున్నాయి. ఇప్పటి జనరేషన్ లో యువతి యువకులు ప్రేమించుకోవడం.. విడిపోవడం.. వేరొకరితో మళ్లీ ప్రేమలో పడటం చాలా తొందరగా జరిగిపోతున్నాయి. కానీ అసలైన ప్రేమ దొరకాలంటే మాత్రం దానికి సమయం పడుతుందని.. సంనయం పాటించాలని ఈసినిమా ద్వారా యువతకు మేసేజ్ ఇచ్చే ప్రయత్నం చేశారు.
ఈసినిమాను యూత్ ను టార్గెట్ చేసి తీసిందే అని ఇప్పటికే టీజర్, ట్రైలర్ ను బట్టి అర్ధమైపోయింది. అయితే రొటీన్ లవ్ స్టోరీ కాకుండా కాస్త డిఫరెంట్ గా చూపించే ప్రయత్నం చేశాడు డైరెక్టర్ ప్రదీప్ బి అట్లూరి. ప్రస్తుతం ఉన్న జనరేషన్ లో యువత ప్రేమ ఎలా ఉంది అన్న పాయింట్ ను రొటీన్ గా కాకుండా చాలా కొత్తగా ఈసినిమాను ప్రెజెంట్ చేసి చూపించాడు. కేవలం లవ్ యాంగిల్ మాత్రమే కాకుండా కామెడీ కూడా ఉంది ఈసినిమాలో.
ఇక పలు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా.. ఆ తరువాత పలు సినిమాల్లో ప్రధాన పాత్రల్లో చేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు కుర్రహీరో విక్రమ్ సహిదేవ్. ఇక ఇప్పుడు హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వర్జిన్ స్టోరీ తో వచ్చాడు. ఇక విక్రమ్ సహిదేవ్ కూడా తన ఏజ్ కు తగ్గ కథను ఎంచుకోవడం ఈసినిమాకు కలిసొచ్చిన అంశం. అనవసరమైన కమర్షియల్ ఎలిమెంట్స్ కు పోకుండా కూల్ గా ఈసినిమాను చేశాడు. ఇక ఇప్పటికే పలు సినిమాల్లో చేసిన అనుభవం ఉంది కాబట్టి చాలా ఈజ్ గా తన పాత్రలో నటించేశాడు విక్రమ్ సహిదేవ్. ఇక విక్రమ్ పాత్రతో పాటు హీరోయిన్ గా చేసిన సౌమిక పాండియన్ కూడా ఈసినిమాకు మరో ప్లస్ పాయింట్. విక్రమ్ తో పోటీగానే నటించింది తను కూడా. మొదటి సినిమా అయినా చాలా చక్కగా, చలాకీగా నటించి తన పాత్రకు న్యాయం చేసింది. మిగిలిన నటీనటులు తమ పాత్రల మేర నటించారు.
సాంకేతిక విభాగానికి వస్తే.. అచ్చు రాజమణి సంగీతం అందించగా.. పాటల సంగతి పక్కన పెడితే..
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం బాగుంది. ఇంకా సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి.
ఫైనల్ గా చెప్పాలంటే యూత్ ను దృష్టిలో పెట్టుకొని తీసిన ఈసినిమా యూత్ ను కనెక్ట్ అయ్యే విధంగానే ఉంది. ఆ విషయంలో మేకర్స్ సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. కామెడీ పరంగా బాగానే ఉన్నా కొన్ని సన్నివేశాల వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ కు కనెక్ట్ అవ్వకపోవచ్చు. మరి వచ్చే వారం వరకూ పెద్దగా సినిమాలు లేవు కాబట్టి ఈవారం రోజులు ఈసినిమాకి కలిసొచ్చే అంశమే.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: