‘గంగూబాయి కతియావాడి’ విమర్శలపై అలియా సమాధానం..!

Alia Bhatt about trolls on her role in Gangubhai Kathiyawadi,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Alia Bhatt,Alia Bhatt movies,Bollywood Actress Alia Bhatt Movies,Alia Bhatt upcoming Movies,Alia Bhatt Latest Movie Updates in 2022,Alia Bhatt Super Hit Movies,Alia Bhatt Trolled in Social Media, Alia Bhatt Trolls on her Role in Movie Gangubhai Kathiyawadi,Alia Bhatt Role in Gangubhai kathiyawadi Movie,Alia Bhatt Gangubhai kathiyawadi,Alia Bhatt clarified About Her Role in Gangubhai Kathiyawadi Movie Gangubhai kathiyawadi Trailer,Gangubhai kathiyawadi Trailer updates,Mafia Queens of Mumbai Novel,Mafia Queens of Mumbai Book,Gangubhai kathiyawadi Movie On Feb 25th,Gangubhai kathiyawadi on 25th Feb 2022, Ajay Devgn,Hero Ajay Devgn,Ajay Devgn Gangubhai Kathiyawadi Movie,SanjayLeelaBhansali Movie Gangubhai Kathiyawadi,#GangubaiKathiawadi,#SanjayLeelaBhansali,#ajaydevgn #aliabhatt

సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో అలియా భట్ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా గంగూబాయి కతియావాడి. మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై పుస్తకం ఆధారంగా సంజయ్ లీలా భన్సాలీ ‘గంగూబాయి కతియావాడి’ని తెరకెక్కించారు. ఇప్పటికే ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టగా.. ఇటీవలే ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. ఇక ట్రైలర్ కూడా సూపర్ రెస్పాన్స్ తెచ్చుకోవడంతో పాటు సినిమాపై అంచనాలు పెరిగాయి. అంతేకాదు అలియాపై ప్రశంసలు కురిపించారు. అయితే ఈపాత్ర లో అలియా నటనను చూసి ప్రశంసించిన వారుంటే… కొంతమంది విమర్శకులు పలు విమర్శలు చేస్తున్నారు. ఈ పాత్రకు అలియా భట్ సరిపోలేదు అన్న కామెంట్స్ చేస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు ఈ విమర్శలపై స్పందించిన అలియా… గంగూబాయి గురించి ప్రజలకు సరైన అవగాహన లేదు.. వాళ్లు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే.. ఈ సినిమా నేను గంగూబాయి వృద్ద వయసులో ఉన్నప్పుడు చేసే పాత్రకాదు.. తన బ్లాక్ అండ్ వైట్ తో ఫొటో చూసి అందరూ అలా అనుకుంటున్నారు.. అందుకే నేను కూడా 50వయసులో ఉన్న పాత్ర చేస్తానని అనుకుంటున్నారు.. కానీ అది నిజం కాదు అని చెప్పి క్లారిటీ ఇచ్చింది.

కాగా ఈ సినిమాలో ఆలియా ముంబై మాఫియా క్వీన్ గంగూబాయి పాత్రలో కనిపించనుంది. అజయ్ దేవ్‌గన్, ఇమ్రాన్ హష్మి, హ్యూమా ఖురేషి అతిథి పాత్రల్లో కనిపించనున్న ఈ సినిమాను పెన్ స్టూడియోస్ భాగస్వామ్యంతో సంజయ్ లీలా భన్సాలీ దర్శక నిర్మాతగా ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈసినిమా ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. హిందీతో పాటు తెలుగులో కూడా ఈసినిమా రిలీజ్ కానుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 + 10 =