మొదటి నుండి డిఫరెంట్ స్టోరీలతో అలరిస్తూ వరుస హిట్స్ ను సొంతం చేసుకుంటున్నాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. ఇక ఇప్పటివరకూ పలు పాత్రలతో అలరించిన వరుణ్ తేజ్ ఇప్పుడు స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్నాడు. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో బాక్సింగ్ నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కింది. ఈసినిమా షూటింగ్ జరపుతూనే మరోపక్క ప్రమోషన్స్ కూడా చేశారు మేకర్స్. దీనిలో భాగంగానే ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఇక రీసెంట్ గానే ఈసినిమా నుండి రోమియో జూలియట్ పాట రిలీజ్ అవ్వగా దానికి కూడా మంచి స్పందన లభించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ముందు ఫిబ్రవరి 25 లేదా ఏప్రిల్ 1న తమ సినిమాను రిలీజ్ చేస్తామని ముందు ప్రకటించినా తాజాగా ఫిర్బవరి 25వ తేదీనే ఫిక్స్ చేస్తూ ఫైనల్ డేట్ ను ప్రకటించారు. దీంతో ప్రమోషన్ కు ఎన్నో రోజులు లేకపోవడంతో ఈరెండు వారాల్లో వీలైనంత ప్రమోషన్స్ చేసి బజ్ క్రియేట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. దీనిలోభాగంగానే తాజాగా ఈసినిమా నుండి ఇక తాజాగా ఈసినిమా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్దమైంది. ఈ చిత్రానికి U/A సర్టిఫికేట్ ఇచ్చింది సెన్సార్ బోర్డు.
Censor done!🥊
See you in theatres real soon!🙌🏽#Ghani pic.twitter.com/0tlPa21ozZ— Varun Tej Konidela 🥊 (@IAmVarunTej) February 11, 2022
ఈసినిమాలో హీరోయిన్ గా సయీ మంజ్రేకర్ నటిస్తుండగా కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర, బాలీవుడ్ స్టార్ హీరో సునీల్ శెట్టి, జగపతి బాబు, నవీన్ చంద్ర ముఖ్య పాత్రలలో నటించారు. స్టార్ హీరోయిన్ తమన్నా ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. ఈ సినిమాను మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణ లో రినైస్సన్స్ పిక్చర్స్, బ్లూ వాటర్స్ క్రియేటివ్ బ్యానర్స్ పై అల్లు బాబీ, సిద్దు ముద్దలు నిర్మిస్తున్నారు. ఈసినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: