సూపర్ స్టార్ మహేష్ బాబు , కీర్తి సురేష్ జంటగా మైత్రీ మూవీ మేకర్స్ , 14 రీల్స్ ప్లస్ , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ కామెడీ “సర్కారు వారి పాట” మూవీ 2022 సంవత్సరం మే 12 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో సముద్రఖని , వెన్నెల కిషోర్ , సుబ్బరాజు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , మహేష్ బాబు బర్త్ డే బ్లాస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.సర్కారు వారి పాట”మూవీ దుబాయ్ , హైదరాబాద్ , గోవా , స్పెయిన్ లలో షూటింగ్ షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకున్న విషయం తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
“సర్కారు వారి పాట” మూవీ మేకర్స్ మహేష్ బాబు అభిమానులకు గుడ్ న్యూస్ అందించారు. ప్రేమికుల రోజున “సర్కారు వారి పాట” నుండి మొదటి సింగిల్‌ని విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించారు. రాబోయే రోజుల్లో వరుస అప్‌డేట్‌ల వర్షం కురుస్తుందని “సర్కారు వారి పాట” టీమ్ ట్వీట్ ద్వారా తెలియజేసింది. ఈరోజు నుండి థమన్ ఎస్ కంపోజ్ చేసిన మొదటి సింగిల్ గురించి ఫిబ్రవరి 9, 11, 14 తేదీల్లో ప్రధాన అప్‌డేట్‌లు సోషల్ మీడియాలో విడుదల కానున్నాయి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: