గత ఏడాది ఎంతో మంది సినీ సెలబ్రిటీలను కోల్పోయాయి పలు సినీ పరిశ్రమలు. అందులో అందరికీ కాస్త విషాదాన్ని.. బాధను కలిగించింది కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ మరణం అని చెప్పొచ్చు. పునీత్ రాజ్ కుమార్ గత ఏడాది అక్టోబర్ 29న గుండె పోటుతో బెంగళూరులోని విక్రమ్ ఆసుపత్రిలో మరణించిన సంగతి తెలిసిందే. పునీత్ రాజ్‌కుమార్ హఠాన్మరణంతో కన్నడ పరిశ్రమతో పాటు ఆయన అభిమానులు కూడా ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయారు. అతి తక్కువ వయసులోనే మరణించడం అందరికీ బాధను కలిగించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా పునీత్ రాజ్ కుమార్ చివరి సినిమా జేమ్స్. ఈ సినిమా డబ్బింగ్ పూర్తికాకముందే పునీత్ రాజ్ కుమార్ మృతి చెందారు. అయితే ఆ పాత్రకు అన్నయ్య శివ రాజ్ కుమార్ డబ్బింగ్ చెప్పారు. జేమ్స్ చిత్రంలోని కొన్ని సీన్లకి శివ రాజ్‌కుమార్ డబ్బింగ్ చెప్పారు. ఇక ఈసందర్భంగా శివ రాజ్ కుమార్ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. నేను ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలకు డబ్బింగ్ చెప్పాను. కానీ ఆ సమయంలో పునీత్ ని అలా చూడటం మనసుకి ఎంతో కష్టంగా అనిపించింది. అతనికి డబ్బింగ్ చెప్పేందుకు ప్రయత్నిస్తున్నా. అది ఎలా ఉంటుందో, జనాలు ఆదరిస్తారో లేదో చూడాలి’ అంటూ ఎమోషనల్‌గా చెప్పుకొచ్చాడు.
కాగా చేతన్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈసినిమాలో శివ రాజ్‌కుమార్, రాఘవేంద్ర రాజ్‌కుమార్ కూడా కనిపించనున్నట్టు తెలుస్తుంది. పునీత్ భార్య అశ్విని పునీత్ ఈసినిమాను నిర్మిస్తున్నారు. అంతేకాదు పునీత్ పుట్టిన రోజు సందర్భంగా మార్చి 17న ఈ సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























