బ్లాక్ బస్టర్ “ఫిదా ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన సాయి పల్లవి , ఆ మూవీ లో తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ , డ్యాన్స్ లతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. నటనకు ప్రాధాన్యత ఉన్న మూవీస్ ను ఎంపిక చేసుకుంటున్న సాయి పల్లవి కథానాయికగా రూపొందిన”లవ్ స్టోరీ“, “శ్యామ్ సింగరాయ్” మూవీస్ ఘనవిజయం సాధించాయి. ఆ మూవీస్ లో సాయి పల్లవి అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. సాయి పల్లవి కథానాయికగా తెరకెక్కిన ”విరాటపర్వం “మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఒక తమిళ మూవీ , ఒక కన్నడ మూవీ కి సాయి పల్లవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
సూపర్ హిట్ “శ్యామ్ సింగ రాయ్ “మూవీ లో సాయి పల్లవి దేవదాసి గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే. అందాల ప్రదర్శన విషయంలో సాయి పల్లవి కెరీర్ ఆరంభం విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నారో అదే తరహా లో అందాల ప్రదర్శన కు పూర్తి దూరంగా ఉంటూ వచ్చారు. పద్ధతైన డ్రెస్ లలో కనిపించే సాయి పల్లవి ఈ సారి భిన్నంగా కనిపించి ప్రేక్షకులను ఆశ్చర్య పరిచారు. సాయి పల్లవిమోడెర్న్ డ్రెస్ ఫోటోలను స్టైలిష్ట్ నీరజ కోన సోషల్ మీడియా లో షేర్ చేశారు. ఆ ఫోటోలు వైరల్ గా మారాయి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: