ఖిలాడి : పెన్ మూవీస్ , ఏ స్టూడియోస్ బ్యానర్స్ పై సూపర్ హిట్ “రాక్షసుడు” మూవీ ఫేమ్ రమేష్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ “ఖిలాడి” మూవీ 2022 ఫిబ్రవరి 11 వ తేదీ రిలీజ్ కానుంది. మీనాక్షి చౌదరి , డింపుల్ హాయతి కథానాయికలు. యాక్షన్ కింగ్ అర్జున్ , ఉన్ని ముకుందన్ , రావు రమేష్ , మురళీశర్మ , వెన్నెల కిషోర్ , అనసూయ ముఖ్య పాత్రలలో నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
రామారావు ఆన్ డ్యూటీ : శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ , ఆర్ టి టీమ్ వర్క్స్ బ్యానర్స్ పై శరత్ మండవ దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కుతున్న “రామారావు ఆన్ డ్యూటీ ” మూవీ ముగింపు దశలో ఉంది. ఈ మూవీ లో దివ్యాంశ కౌశిక్ , రజిష విజయన్ కథానాయికలు. ఈ మూవీ లో “కమిట్ మెంట్ “మూవీ ఫేమ్ అన్వేషి జైన్ ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు.
ధమాకా : పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై మాస్ డైరెక్టర్ నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో రవితేజ , “పెళ్ళిసందD “మూవీ ఫేమ్ శ్రీ లీల జంటగా మాస్ ఎంటర్ టైనర్ మూవీ “#RT 69 ” షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయ్యింది. భీమ్స్ సంగీతం అందిస్తున్నారు. ఫన్ , ఫ్యామిలీ ఎమోషన్స్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ టైటిల్ ” ‘ధమాకా ” గా అనౌన్స్ చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విజయ దశమి పండగ సందర్భంగా మేకర్స్ రిలీజ్ చేశారు . ఫస్ట్ లుక్ పోస్టర్ లో హీరో రవితేజ మాస్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.
రావణాసుర : అభిషేక్ పిక్చర్స్ , ఆర్ టి టీమ్ బ్యానర్స్ పై సుధీర్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ “రావణాసుర” మూవీ సెప్టెంబర్ 30 న రిలీజ్ కానుంది. రవితేజ పది డిఫరెంట్ గెటప్ లలో కనిపించి సర్ ప్రైజ్ చేయబోతున్న ఈ మూవీ లో అను ఇమ్మాన్యుయేల్, ఫరియా అబ్దుల్లా, మేఘా ఆకాష్, పూజిత పొన్నాడ , దక్ష నగార్కర్ కథానాయికలు. ఇప్పటికే చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ మూవీ కి హర్షవర్ధన్ రామేశ్వర్ , భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి విడుదల చేసిన రవితేజ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.
టైగర్ నాగేశ్వర రావు : తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై వంశీ దర్శకత్వం లో రవితేజ హీరోగా పాన్ ఇండియా మూవీ “టైగర్ నాగేశ్వరరావు ” తెరకెక్కనుంది. ఈ మూవీ నుండి ఫస్ట్ పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేయగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. స్టువర్ట్ పురం గజదొంగ నాగేశ్వరరావు జీవిత చరిత్ర ఆధారంగా ఈ మూవీ తెరకెక్కనుంది.
[totalpoll id=”73830″]
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: