సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్, రష్మిక జంటగా తెరకెక్కిన ”పుష్ప” మూవీ ఫస్ట్ పార్ట్ “పుష్ప: ది రైజ్” డిసెంబర్ 17న తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషలలో విడుదల అయ్యి ఘనవిజయం సాధించి భారీ వసూళ్ళు రాబడుతున్న విషయం తెలిసిందే. స్టార్ హీరోయిన్ సమంత ఒక స్పెషల్ సాంగ్ లో నటించిన విషయం తెలిసిందే. . దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
View this post on Instagram
దేవిశ్రీ ప్రసాద్ స్వరకల్పనలో చంద్ర బోస్ రచన ఇంద్రావతి చౌహాన్ హస్కీ వాయిస్‌తో గానం చేసిన ఊ అంటావా.. ఊఊ అంటావా సాంగ్ కు సమంత అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ స్పెషల్ సాంగ్ సోషల్ మీడియాను షేక్ చేసింది. చిన్నా , పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ‘ఊ అంటావా’ పాటకు ఫిదా అయిపోయారు. బాలీవుడ్ డ్యాన్సింగ్ క్వీన్ మాధురీ దీక్షిత్ ఊ అంటావా మావా.. ఊఊ అంటావా సాంగ్ ను తన ఫేస్ ఎక్స్ ప్రెషన్స్ తో అభినయించి ఆ వీడియో ను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేయగా అభిమానులను ఆకట్టుకుని వైరల్ గా మారింది.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: