అజయ్ భూపతి దర్శకత్వంలో కార్తికేయ, పాయల్ రాజ్ పుత్ హీరో హీరోయిన్లు గా వచ్చిన సినిమా ఆర్ఎక్స్100. ఇక ఈ సినిమా ఎంత సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఈసినిమాతోనే టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి… తొలి చిత్రంతోనే మంచి మార్కులు కొట్టేసింది పాయల్ రాజ్ పుత్. ఇక ఆ చిత్రం తర్వాత వరుస ఆఫర్స్ ను దక్కించుకుంటూ దూసుకుపోతుంది. ఇప్పటికే వెంకీ మామ, డిస్కోరాజా సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ప్రస్తుతం అయితే పాయల్ పలు సినిమాలతో బిజీగా ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే తాజాగా తన ఇన్ట్సాలో తన కొత్త సినిమాకు సంబంధించిన అప్ డేట్ ఇచ్చింది పాయల్. సినిమా పేరు మాత్రం చెప్పలేదు కానీ.. ఒక ఫొటోను పోస్ట్ చేస్తూ కొత్త సినిమా షూటింగ్ మొదలైందని.. 2022 లో ఫస్ట్ షూటింగ్ చాలా ఎగ్జైటింగ్ గా ఉందని.. మీ ప్రేమ సపోర్ట్ అందిస్తారని కోరుకుంటున్నా అంటూ పోస్ట్ లో పేర్కొంది.
View this post on Instagram
కాగా పాయల్ ప్రస్తుతం తెలుగులో ఆది హీరోగా వస్తున్న కిరాతక సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఈసినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది. ఇంకా ఈసినిమాలతో పాటు ఏంజెల్, గోల్ మాల్ అనే తమిళ మూవీస్ లో కూడా నటిస్తుంది. మలయాళంలోకి కూడా ఎంట్రీ ఇస్తుంది. హెడ్ బుష్ అనే సినిమాతో శాండల్ వుడ్ లో అడుగుపెడుతుంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: