పిడివి ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్ టైన్ మెంట్స్ , ఫార్ట్యూన్ 4 సినిమాస్ బ్యానర్స్ పై కల్యాణ్ శంకర్ దర్శకత్వంలో నవీన్ పోలిశెట్టి హీరోగా “అనగనగా ఒక రాజు ” మూవీ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ మూవీ నుండి నవీన్ లుక్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. సంక్రాంతి సందర్భంగా ఈ చిత్రం టైటిల్ టీజర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. నవీన్ పోలిశెట్టి డైలాగ్స్ తో, రాజుగాడి పెళ్లి పేరుతో రూపొందిన టైటిల్ టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కమర్షియల్ హిట్ “పెళ్ళి సంద D ” మూవీ తో శ్రీలీల టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. ఆ మూవీ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్న శ్రీలీల పలు మూవీ ఆఫర్స్ అందుకుంటున్నారు. మాస్ మహారాజా రవితేజ కు జోడీగా శ్రీ లీల “ధమాకా ” మూవీ లో నటిస్తున్నారు. తాజాగా “అనగనగా ఒక రాజు ” మూవీలో నవీన్ పోలిశెట్టి కి జోడీగా శ్రీ లీల ఎంపిక అయినట్టు సమాచారం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: