అ, కల్కి, జాంబిరెడ్డి సినిమాలతో టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రశాంత్ వర్మ. మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా తను డిఫరెంట్ సినిమాలు చేస్తాడు అన్న పేరును తెచ్చుకున్నాడు. ఇక ఇప్పుడు మరో డిఫరెంట్ స్టోరీతో వస్తున్న సంగతి తెలిసిందే. హనుమాన్ మరో సినిమాతో రాబోతున్నాడు. ఇది కూడా డిఫరెంట్ జోనర్ లోనే వస్తుంది. సూపర్ హీరోస్ బ్యాక్ డ్రాప్ లో ఈసినిమాను తెరకెక్కిస్తున్నాడు ప్రశాంత్ వర్మ. జాంబిరెడ్డి సినిమాతో హీరోగా పరిచయమైన తేజా సజ్జాతోనే హనుమాన్ అనే సినిమా చేస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమాషూటింగ్ ను కూడా ఎప్పుడో మొదలుపెట్టింది చిత్రయూనిట్. ఇప్పటికే కొంతవరకూ షూటింగ్ ను పూర్తి చేసుకోగా కరోనా వల్ల షూట్ కు బ్రేక్ పడింది. ఇప్పుడు తాజాగా మళ్లీ షూటింగ్ ను మొదలుపెట్టారు. కొత్త షెడ్యూల్ ను నేటి నుండి మొదలుపెట్టినట్టు ప్రశాంత్ వర్మ తన సోషల్ మీడియా ద్వారా తెలియచేశాడు.
View this post on Instagram
కాగా `హనుమాన్` ఓ సైన్స్ ఫిక్షన్ మూవీ అన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని పురాణాల్లోని హనుమంతుని కథ స్పూర్తితో సూపర్ హీరో క్యారెక్టర్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. ఈసినిమాలో అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తుంది. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై కె.నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్‌కీ ప్రాధాన్యం ఉంది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: