“ఫొటో”మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన అంజలి తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ భాషల పలు సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. సూపర్ హిట్ “సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు “, “గీతాంజలి ” మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి అంజలి బెస్ట్ యాక్ట్రెస్ గా నంది అవార్డ్స్ అందుకున్నారు. రీసెంట్ గా బ్లాక్ బస్టర్ “వకీల్ సాబ్ “మూవీ లో అంజలి అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. అంజలి ప్రస్తుతం “ఆనందభైరవి “, “F 3 “, “పూచండి “(తమిళ ), “శివప్ప “(కన్నడ ) మూవీస్ లో నటిస్తున్నారు. రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న “#RC15″ మూవీ లో ఒక కీలక పాత్రకు అంజలి ఎంపిక అయినట్టు సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
టాలెంటెడ్ యాక్ట్రెస్ అంజలి ఇప్పుడు మహిళా ప్రధాన “ఝాన్సీ”తెలుగు వెబ్ సిరీస్ తో డిజిటల్ ఎంట్రీ ఇస్తున్నారు. కొంత కాలంగా ఇన్ స్టా గ్రామ్ కు దూరంగా ఉన్న అంజలి తాజాగా ఎల్లో కలర్ డ్రెస్ ధరించి గోల్డ్ కలర్ హెయిర్ , మ్యాచింగ్ బ్యాక్ గ్రౌండ్ కలర్ యాంబియెన్స్ తో అందాల్ని ఆవిష్కరిస్తూ సమ్ థింగ్ స్పెషల్ గా కనిపిస్తున్న తన ఫొటో ను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేయగా అభిమానులను ఆకట్టుకుని వైరల్ గా మారింది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: