నిహారిక ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ “టాక్సీవాలా” మూవీ ఫేమ్ రాహుల్ సంక్రుత్యన్ దర్శకత్వంలో హీరో నాని కథానాయకుడిగా కోల్ కత్తా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన సూపర్ నేచురల్ థ్రిల్లర్ “శ్యామ్ సింగరాయ్ ” మూవీ భారీ అంచనాలతో డిసెంబర్ 24న విడుదల అయ్యి సూపర్ హిట్ టాక్ , అద్భుత కలెక్షన్స్ తో దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది. సాయి పల్లవి , కృతి శెట్టి , మడోన్నా సెబాష్టియన్ కథానాయికలు. మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు. “శ్యామ్ సింగరాయ్” చిత్రంలో హీరో నాని ప్రస్తుత కాలంలో ఫిల్మ్ మేకర్ గా., 1970ల కాలం నాటి బెంగాలీ రచయితగా రెండు విభిన్నమైన పాత్రలు , దేవదాసి పాత్రలో సాయి పల్లవి అద్భుతంగా నటించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు..
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
“శ్యామ్ సింగరాయ్ ” మూవీ సక్సెస్ మీట్ ను చిత్ర యూనిట్ సోమవారం హైదరాబాద్ లో నిర్వహించింది. హీరో నాని మాట్లాడుతూ.. ఎవరూ సినిమా బాగుందని ఒకటి రెండు లైన్లలో చెప్పడం లేదనీ , ఆల్మోస్ట్ ఒక లవ్ లెటర్ లా రాస్తున్నారనీ , అదే మాకు పెద్ద సక్సెస్ అనిపిస్తోందనీ , ఎలాంటి పరిస్థితులు ఉన్నా మంచి చిత్రాలను ఆదరిస్తామని ప్రేక్షకులు ప్రతిసారీ నిరూపిస్తూనే ఉన్నారనీ , మీ ప్రోత్సాహం ఉన్నంత వరకు మీకు మంచి సినిమాలు ఇచ్చేందుకు ప్రాణం పెట్టి పని చేస్తామనీ , వరుస విజయాలతో ఈ నెల అంతా బాగుందనీ , అన్ని పరిస్థితులు చక్కబడి ఈ ఊపు ఇలాగే మరో పదేళ్లు కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాననీ , టీమ్ అందరికీ, తెలుగు ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలనీ , ఈ న్యూ ఇయర్ కూడా మనదేననీ చెప్పారు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: