డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, అలియా భట్ ఒక జంటగా , యంగ్ టైగర్ ఎన్టీఆర్ , ఒలీవియా మోరిస్ మరో జంటగా , భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా “రౌద్రం రణం రుధిరం ” మూవీ 2022 జనవరి 7వ తేదీ ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున , భారీ అంచనాలతో రిలీజ్ కానుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు , ఎన్టీఆర్ కొమరం భీమ్ గానూ నటించిన ఈ మూవీ లో అజయ్ దేవగన్ , సముద్ర ఖని , శ్రియ ముఖ్య పాత్రలలో నటించారు. కీరవాణి సంగీతం అందించారు.“రౌద్రం రణం రుధిరం ” మూవీ నుండి రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్స్ , సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
దక్షిణాది భాషలతో పాటు హిందీ భాషలో కూడా రిలీజ్ అవుతున్న “రౌద్రం రణం రుధిరం ” మూవీ హిందీ వెర్షన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ 19 వ తేదీ ముంబై లో గ్రాండ్ గా జరిగింది. ఈ ఈవెంట్ లో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ముఖ్య అతిథి , నిర్మాత కరణ్ జోహార్ హోస్ట్ గా పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాలనుండి ఈ ఈవెంట్ కు సుమారు 3000 మంది అభిమానులు పాల్గొనడం విశేషం. మేకర్స్ భారీ ఖర్చు తో జరిపిన ఈ ఈవెంట్ లో హీరోలు సల్మాన్ ఖాన్ , ఎన్టీఆర్ , రామ్ చరణ్ స్పెషల్ గా డిజైన్ చేసిన వెహికిల్స్ తో స్టేజ్ పైకి ఎంట్రీ ఇచ్చారు. రామ్ చరణ్ , ఎన్టీఆర్ లు దర్శకుడు రాజమౌళి , హీరో సల్మాన్ ఖాన్ లపై ప్రశంసలు కురిపించారు. హీరో సల్మాన్ ఖాన్ తన కొత్త సినిమా “భజరంగి భాయిజాన్ 2” మూవీ ని అనౌన్స్ చేయగా , “RRR” మూవీ లో ఒక స్పెషల్ సీక్వెన్స్ ప్రేక్షకులను షాక్ కు గురిచేయనుందని రాజమౌళి చెప్పారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఒక టీవీ ఛానెల్ లో స్పెషల్ ప్రోగ్రామ్ గా ప్రసారం కానుంది.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: