ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ లాంటి సక్సెస్‌ఫుల్ కాంబోలో ఎంతో ప్రతిష్టాత్మకంగా వచ్చిన సినిమా ‘పుష్ప’. ఈసినిమా రెండు పార్ట్ లుగా వస్తుండగా మొదటి పార్ట్ డిసెంబర్ 17న రిలీజ్ అయింది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా రిలీజ్ అయింది. ఇక మొదటి రోజునుండే ఈసినిమా మంచి టాక్ తో దూసుకుపోతుంది. అల్లు అర్జున్ నటన, సుకుమార్ డైరెక్షన్ రెండూ సినిమాను హిట్ గా నిలిపాయి. ఇక కలెక్షన్స్ పరంగా కూడా ఈసినిమా ఎక్కడా తగ్గట్లేదు. ఇప్పటికే ఈసినిమా 100కోట్ల క్లబ్ లో కూడా చేరిపోయింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా ఓవర్సీస్ ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగానే జరిగింది. దీనిలో భాగంగానే ఇప్పుడు పుష్ప కూడా యూఎస్ బాక్సాఫీస్ వద్ద తన హవా ను కొనసాగిస్తుంది. అక్కడ కూడా మంచి టాక్ తో దూసుకుపోతున్న ఈసినిమా ఇప్పటికే 1మిలియన్ కు పైగా కలెక్షన్స్ ను రాబట్టింది. అంతేకాదు కరోనా తరువాత ఈరేంజ్ లో కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా కూడా పుష్ప కొత్త రికార్డ్ ను క్రియేట్ చేసింది. ఫస్ట్ వీకెండ్ కు పుష్ప యూఎస్ బాక్సాఫీస్ వద్ద దాదాపు 1.5 మిలియన్స్ ను కలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకా కలెక్షన్స్ రాబట్టాలి. సెకండ్ వీకెండ్ కు ఆ కలెక్షన్స్ కూడా వచ్చేస్తాయని అంటున్నారు సినీ విశ్లేషకులు.
కాగా ముత్తంశెట్టి మీడియా అసోషియేషన్‌తో కలిసి మైత్రీ మూవీ మేకర్స్ వారు సంయుక్తంగా ఈసినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించారు. రష్మిక మందన్న హీరోయిన్ గా నటించగా.. ఫహాద్ ఫాజిల్, సునీల్, అనసూయ, ధనంజయ పలు కీలక పాత్రల్లో నటించారు. ఇక సమంత స్పెషల్ సాంగ్ లో నటించగా ఆ పాట ఎంత క్రేజ్ ను సొంతం చేసుకుందో చూస్తున్నాం..
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: