యంగ్ హీరో ‘లక్ష్’ మాత్రం ఇప్పుడు వరుస సినిమాలను చేసుకుంటూ వెళుతున్నాడు. కెరీర్ లోఅంతకు ముందు కొన్ని సినిమాలలో నటించి నటుడిగా ప్రేక్షకులను అలరించినా నిరాశే ఎదురైంది. కానీ ఆ మధ్య వచ్చిన ‘వలయం’ సినిమాతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘గ్యాంగ్‌స్టర్ గంగరాజు’. విభిన్నమైన కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఇషాన్ సూర్య దర్శకత్వం వహిస్తుండగా శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ పతాకంపై పద్మావతి చదలవాడ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ‘చదలవాడ బ్రదర్స్’ సమర్పణలో రాబోతున్న ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ లుక్, సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఇక ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకునే పనిలో ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు మరో కొత్త సినిమాను కూడా లైన్ లో పెట్టాడు. ఈసినిమా కూడా శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ బ్యానర్ పైనే తెరకెక్కుతుంది. ఇక తాజాగా ఈసినిమాకు సంబంధించిన అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమాలో లక్ష్ హీరోగా నటిస్తున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా ఈసినిమాకు సంబంధించిన వివరాలను త్వరలో తెలియచేస్తామని తెలిపారు.
New Beginnings 🎥#ProductionNo12 under Pre-production! Stay tuned for more updates!!@itsactorlaksh @sttvfilms #Vikranthsrinivas #pckhannan #Laksh07 pic.twitter.com/OlSpyl14eX
— STTVFilms (@sttvfilms) December 14, 2021
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: