సినిమాటోగ్రఫీ రెగ్యులరైజేషన్ ఎమెండ్ మెంట్ బిల్లుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం ఏపీ సినిమా హాళ్లలో ఇకపై ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు చిన్న పెద్ద అని తేడా లేకుండా అన్ని సినిమాలూ రోజుకు నాలుగు షోలు మాత్రమే వేయాలనీ , అదనపు షోలకు అవకాశం లేదనీ , అన్ని సినిమాల టికెట్స్ రేట్లు ఒకేలా ఉండాలనీ , బ్లాక్ టికెట్స్ కు చెక్ పెట్టేలా సినిమా టికెట్ల విక్రయాలన్నీ ఆన్ లైన్ పోర్టల్ ద్వారా జరగనున్నాయనీ ప్రభుత్వం స్పష్టం చేసిన విషయం తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కరోనా మహమ్మారి కారణంగా చిత్ర పరిశ్రమ పలు విధాలా నష్టపోయింది. ఆంధ్ర ప్రదేశ్ లో తక్కువ టికెట్ రేట్లతో వర్కౌట్ కాదని వరసబెట్టి పెద్ద సినిమాలు విడుదల వాయిదా వేసుకున్నాయి. ఈ నేపధ్యంలో వచ్చిన తాజాగా “అఖండ” మూవీ సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్నా ఏపీలో మాత్రం తక్కువ టికెట్ల రేట్ల వల్ల ఈ రోజుకీ కొన్ని కేంద్రాలలో బ్రేక్ ఈవెన్ కాలేదు. ఇప్పుడు చాలా పెద్ద సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఈ నేపధ్యంలో టికెట్ల రేట్లు ఈ విధంగా ఉంటే కనుక బాగా లాస్ అవుతామని అంతా భావిస్తున్నారు. సరిగ్గా ఈ టైమ్ లో థియేటర్ల యజమానులు కోర్టుకు వెళ్ళడం అత్యున్నత న్యాయస్థానం జీవో నంబర్ 35ని రద్దు చేయడంతో అందరూ రిలీఫ్ అయ్యారు. థియేటర్ల యజమానులకు కొత్త సినిమాలు విడుదల అయ్యే సమయంలో రేట్లు పెంచుకునే అవకాశం ఉందనీ పిటిషనర్ తరఫున వినిపించిన వాదనలకు కోర్టు అంగీకరించింది. అదే టైమ్ లో టికెట్ల రేట్లను తగ్గించే అధికారం ప్రభుత్వానికి లేదంటూ తీర్పు చెప్పింది. ఈ తీర్పుపై థియేటర్ల యజమానులతో పాటు టాలీవుడ్ మేకర్స్ అంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: