ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా వస్తున్న సినిమా హనుమాన్. సూపర్ హీరోస్ బ్యాక్ డ్రాప్ లో మరో కొత్త జోనర్ తో వస్తున్నాడు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను శరవేగంగా జరుపుకుంటుంది. ఇక మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ చేతుల మీదుగా ఈసినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఇక తాజాగా ఈసినిమాలో హీరోయిన్ గా అమృత అయ్యర్ ను ఫిక్స్ చేశారు. నేడు అమృత అయ్యర్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ ను తమిళ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి రిలీజ్ చేశారు . ఈసినిమాలో అమృత అయ్యర్ మీనాక్షి పాత్రలో నటిస్తుంది. తన క్యారెక్టర్ ను పరిచయం చేస్తూ.. మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. అందమైన సరస్సులో.. రంగురంగుల చేపలు ఎగురుతుండగా.. పడవలో షికారు చేస్తూ.. ప్రకృతి అందాలు ఆస్వాధిస్తున్న మీనాక్షి లుక్ ఆకట్టుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
Happy to share the Poster of @Actor_Amritha as #Meenakshi from the world of Anjanadri 🏔 #HanuMan
The First Pan-Indian SuperHero FilmA @PrasanthVarma Film🎥 @tejasajja123 @Niran_Reddy @Primeshowtweets @Chaitanyaniran #HanuManTheOrigin pic.twitter.com/5Qv8gYi9Vk
— VijaySethupathi (@VijaySethuOffl) December 13, 2021
కాగా `హనుమాన్` ఓ సైన్స్ ఫిక్షన్ మూవీ అన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని పురాణాల్లోని హనుమంతుని కథ స్పూర్తితో సూపర్ హీరో క్యారెక్టర్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై కె.నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్‌కీ ప్రాధాన్యం ఉంది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: