రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో న్యాచులర్ స్టార్ నాని హీరోగా వస్తున్న సినిమా శ్యామ్ సింగరాయ్. ఇక ఈసినిమా నుండి వచ్చిన ప్రతి ఒక్క అప్డేట్ సినిమా మీద అంచనాలను పెంచేసింది. ఫస్ట్ లుక్ విడుదల చేసినప్పటినుంచి ఇప్పటి వరకు సినిమా మీద అంచనాలు పెరుగుతూనే వచ్చాయి. ఇక టీజర్‌కు విశేషమైన స్పందన వచ్చింది. మరోవైపు ఈసినిమాను డిసెంబర్ 24న రిలీజ్ చేస్తున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు. రానున్న రోజుల్లో సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ కార్యక్రమాలను చిత్రయూనిట్ మరింత పెంచనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా శ్యామ్ సింగ రాయ్ రాయల్ ఈవెంట్‌కు సంబంధించిన అప్డేట్ ఇచ్చారు మేకర్స్. డిసెంబర్ 14న వరంగల్‌లోని రంగలీల మైదానంలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా ఏర్పాటు చేయబోతోన్నారు. నానితో పాటు చిత్రయూనిట్ అంతా కూడా ఈ ఈవెంట్‌లో పాల్గొననున్నారు.
#ShyamSinghaRoy 🔱 to STEP on the LAND of Revolutions ✊#SSRRoyalEvent 🤩🔥will be held at Warangal on DEC 14th from 5 PM Onwards ✨
Natural🌟@NameisNani @Sai_Pallavi92 @IamKrithiShetty @MadonnaSebast14 @vboyanapalli @Rahul_Sankrityn @MickeyJMeyer @NiharikaEnt#SSRonDEC24th💥 pic.twitter.com/D9oDN0gbrn
— Niharika Entertainment (@NiharikaEnt) December 10, 2021
కాగా ఈసినిమాలోసాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్‌లు హీరోయిన్లుగా నటిస్తుండగా జిషు సేన్ గుప్తా, మురళీ శర్మ, రాహుల్ రవీంద్రన్, అభినవ్ గోమటం కీలకమైన పాత్రలలో నటిస్తున్నారు. నిహారిక ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈసినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందిస్తుండగా.. జాన్ వర్గీస్ కెమెరామెన్‌గా పని చేస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: