రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్-రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో వస్తున్న మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్. పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కిన సినిమా అవ్వడంతో ఈసినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఫ్యాన్స్ తో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ప్రమోషన్స్ లో భాగంగా ఈసినిమా ట్రైలర్ నేడు రిలీజ్ అయిన సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలో ఈ ట్రైలర్ కు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో కూడా చూస్తూనే ఉన్నాం. అందరూ ఎదురుచూసిన ఎగ్జైట్ మెంట్ కు తగ్గట్టే రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ య్యూట్యూబ్ ను షేక్ చేస్తుంది. దీంతో మరోసారి రాజమౌళి తన సత్తాను చూపించాడు. అంచనాలకు మించి ఈ ట్రైలర్ ఉండటంతో అందరూ ఈ ట్రైలర్ పై ప్రసంశలు కురిపిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా హిందీ ట్రైలర్ కూడా నేడు రిలీజ్ అయింది. ముంబైలో ట్రైలర్ లాంచ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ట్రైలర్ లాంచింగ్ ఈవెంట్‌లో ఆర్ఆర్ఆర్ మూవీ యూనిట్ పాల్గొంది. ఇక ఈ సందర్బంగా ఎన్టీఆర్ ఈసినిమా గురించి అలానే రాజమౌళి గురించి మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నేను రాజమౌళిని రాజమౌళి అని పిలవలేను.. నాకు ఆయన జక్కన్న మాత్రమే.. తనతో జర్నీ మొదలైనప్పటినుండి అది నా మైండ్లో ఫిక్స్ అయిపోయింది.. ఆయన ఒక శిల్పకారుడు.. రాజమౌళి లాంటి డైరెక్టర్ తోనే ఒక నటుడిగా నేను ఏదైనా కొత్తగా చేయాలి అనే ప్రయత్నం నెరవేరుతుంది. మేమిద్దరం కలిసి సినిమాలు చేసినా.. చేయకపోయినా కథల గురించి చర్చించుకుంటాం.. నా కంఫర్ట్ జోన్ నుండి బయటకు వచ్చేలా నాకు ఎప్పుడూ పుష్ ఇస్తుంటాడు రాజమౌళి. అంతేకాదు ఆర్ఆర్ఆర్ సినిమాకు హిందీ ఆడియెన్స్ నుంచి వచ్చే స్పందన ఎలా ఉంటుందో చూడాలని చాలా కోరికగా ఉందని కూడా తెలిపాడు.



[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: