“లక్ష్య “మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైలైట్స్

Naga Shaurya's Lakshya Movie Pre Release Event Highlights,Lakshya Trailer,Naga Shaurya,Ketika Sharma,Latest 2021 Telugu Movie,Latest Telugu Movies 2021,Telugu Filmnagar,New Telugu Movies 2021,Latest Movie Trailer,New Telugu Movie,Lakshya,Lakshya Movie,Lakshya Telugu Movie,Lakshya Movie Updates,Lakshya Updates,Lakshya Movie Latest Updates,Lakshya Latest Updates,Lakshya Movie Trailer,Lakshya Telugu Movie Trailer,Naga Shaurya Lakshya,Naga Shaurya Lakshya Movie,Naga Shaurya,Hero Naga Shaurya,Naga Shaurya Movies,Naga Shaurya New Movie,Naga Shaurya Latest Movie,Naga Shaurya New Movie Update,Naga Shaurya Latest Movie Update,Naga Shaurya Upcoming Movie,Ketika Sharma,Ketika Sharma Movies,Ketika Sharma New Movie,Jagapathi Babu,Lakshya Songs,Lakshya Movie Songs,Lakshya Teaser,Lakshya Movie Teaser,Lakshya Release Date,Naga Shaurya And Ketika Sharma Movie,Lakshya Movie Pre Release Event Highlights,Lakshya Pre Release Event Highlights,Lakshya Movie Pre Release Event,Lakshya Pre Release Event,Lakshya Movie Pre Release,Lakshya Pre Release,Lakshya Event,Lakshya Movie Event,Lakshya Movie Pre Release Highlights,Lakshya Pre Release Highlights,Naga Shaurya Lakshya Pre Release Event Highlights,#Lakshya,#LakshyaOnDec10th,#LakshyaTrailer

సోనాలి నారంగ్ స‌మ‌ర్పణ‌లో శ్రీ వేంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌ఎల్‌పి, నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్స్ పై సంతోష్‌ జాగర్లపూడి దర్శకత్వంలో నాగశౌర్య , ​“రొమాంటిక్ “మూవీ ఫేమ్ కేతిక శర్మ జంటగా ప్రాచీన విలువిద్య నేప‌థ్యంలో తెరకెక్కిన “లక్ష్య “మూవీ డిసెంబర్ 10 వ తేదీ రిలీజ్ కానుంది. ఈమూవీ లో ఆర్చర్ గా నటిస్తున్న నాగశౌర్య ఎయిట్ ప్యాక్ బాడీ తో కనిపించనున్నారు. జగపతిబాబు ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. కాలభైరవ సంగీతం అందిస్తున్నారు.“లక్ష్య “మూవీ యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. “లక్ష్య “మూవీ ఆర్చరీ బ్యాక్ డ్రాప్ లో రాబోతున్న మొదటి టాలీవుడ్ మూవీ కావడంతో ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

లక్ష్య “మూవీ ప్రీ-రిలీజ్‌ వేడుక ఆదివారం (డిసెంబర్‌ 5) జరిగింది. ఈ కార్యక్రమానికి హీరో శర్వానంద్‌, దర్శకుడు శేఖర్ కమ్ముల, బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా హీరో శర్వానంద్ మాట్లాడుతూ ..క్రీడా నేపథ్యంతో సినిమా చేయడానికి, తీయడానికి చాలా ధైర్యం కావాలనీ , ఈ జోనర్‌లో వచ్చిన సినిమాలు ఎక్కువగా విజయాల్నే అందుకున్నాయనీ , ఇలాంటివి చేస్తున్నప్పుడు నటుడికే ఎక్కువ బాధ్యత ఉంటుందనీ , నాగశౌర్య పడిన కష్టం కనిపిస్తోందనీ , తాను ఇప్పుడు చేస్తున్న సినిమాలు పూర్తయ్యాక నాగశౌర్యలా సిక్స్‌ప్యాక్‌తో సిద్ధమయ్యాకే మరో సినిమా చేస‍్తాననీ , “అఖండ” మూవీ విజయం సీజన్‌కు మంచి సంకేతమనీ , నాగశౌర్యకు మరిన్ని విజయాలు రావాలనీ చెప్పారు. ప్రచార చిత్రాలు ఆకట్టుకునేలా ఉన్నాయని దర్శకుడు శేఖర్ కమ్ముల చెప్పారు. ఆర్చరీ అనేది ప్రేక్షకులకు కొత్త అనీ, అందులోనే విజయం ఉందనీ , భారతీయ క్రీడా సినిమాల్లో నిలిచిపోయే మరో చిత్రం ‘లక్ష్య’ కావాలని కోరుకుంటున్నా అని పుల్లెల గోపీచంద్ అన్నారు. సినిమా అనేది కళారూపం. దానికి ఆక్సిజన్‌ థియేటర్‌ వ్యవస్థ. ఆ ఆక్సిజన్‌ అందజేసే వ్యక్తి నిర్మాత నారాయణ్‌దాస్‌ నారంగ్‌.’ అని లక్ష్య చిత్రం దర్శకుడు సంతోష్ జాగర్లపూడి చెప్పారు. హీరో నాగశౌర్య మాట్లాడుతూ .. ఆల్ ది బెస్ట్ అంటూ డైరక్టర్ సంతోష్ కి విషెస్ తెలిపారు. “లక్ష్య “మూవీ టీమ్ అందరి ఎఫర్ట్స్ పై నాగ శౌర్య ప్రశంసల వర్షం కురిపించారు.హీరోయిన్ కేతిక శర్మ మాట్లాడుతూ .. తనకు ఈ మూవీ లో అవకాశమిచ్చిన నిర్మాత , దర్శకులకు , ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చిన శర్వానంద్ , శేఖర్ కమ్ముల , పుల్లెల గోపీచంద్ గారికి థ్యాంక్స్ చెప్పారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen + 4 =